ప్రభాస్ కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలిస్తే షాక్ అవ్వాలసిందే
రెబెల్ స్టార్ కృష్ణంరాజు వారసునిగా,నిర్మాత యు సూర్యనారాయణ తనయుడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి,ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ హోల్ ఇండియా స్టార్ అయికూర్చుకున్నాడు. అంతేనా వరల్డ్ వైడ్ గుర్తింపు పొందాడు. అంతకు ముందు తను యాక్ట్ చేసిన డబ్బింగ్ సినిమాలతో ప్రభాస్ హిందీ ప్రేక్షకులతో పాటు మిగతా భాషలకు చెందిన ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక బాహుబలితో ప్రభాస్ క్రేజ్ ఏకంగా లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్‌కు చేరిపోయింది. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ యాక్ట్ చేసిన ‘సాహో’ సినిమా ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమా రూ. 400 కోట్లకు పైగా కలెక్ట్ చేసి హీరోగా ప్రభాస్ స్టామినా ఏంటో చాటిచెప్పింది.
బాహుబలి సినిమాతో ప్రభాస్, ఒక్కసారిగా ఆల్ ఇండియా స్టార్ అవ్వడంతో సాహో సినిమాకు దాదాపు నిర్మాణంలో వాటతో పాటు రెమ్యూనరేషన్ కలిపి దాదాపు రూ.75 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకొని అందరినీ ఆశ్యర్యపరిచాడు. ఇపుడు రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తోన్న సినిమా కోసం కూడా దాదాపు అంతే లెవల్‌లో అందుకుంటున్నాడట. అలాగే అశ్వినీదత్ వైజయంతి మూవీస్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తోన్న సినిమాకు దాదాపు రూ. 100 కోట్ల వరకు పారితోషకం అని టాక్. ఇలా సినిమాల్లో తీసుకునే ఈ రెమ్యునరేషన్ కాకుండా ప్రభాస్‌కు పెద్ద ఎత్తున ఆస్తులున్నాయి. ప్రభాస్ నాన్న సూర్యనారాయణ రాజు నిర్మాతగా పెద్ద నాన్న కృష్ణంరాజుతో పలు హిట్ చిత్రాలను నిర్మించారు.
అంతేకాదు కృష్ణంరాజుకు సంబంధించిన అన్ని వ్యవహారాలను సూర్యనారాయణ రాజు దగ్గరుండి చేసుకునేవారు. ఆయన తెలుగు రాష్ట్రాల్లో పాటు చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో స్థలాలను కొన్నారు. గోపీకృష్ణ బ్యానర్ తో సినిమాలే కాదు ఒక గ్రానైటు ఫ్యాక్టరీ కూడా ఉంది. వీటితో పాటు వ్యవసాయ ఆధారిత పొలాలు, కొబ్బరి తోటలు, వివిధ నగరాల్లో ఫామ్‌హౌస్‌లు నిండుగానే ఉన్నాయని టాక్. ఈలెక్కన చూస్తే, ప్రభాస్‌కు దాదాపు స్థిర, చర ఆస్తులు కలపి దాదాపు రూ. 7 వేల కోట్లకు పైనే ఉంటాయట. తెలుగు ఇండస్ట్రీలో ఇన్ని ఆస్తులున్న హీరో మరొకరు లేరని అంటున్నారు.