చిరంజీవి,మోహన్ బాబు కలిసి నటిస్తున్నారా…అభిమానులకు పండగే
చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఆచార్య. ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ నటిస్తుండగా ఓ ప్రత్యేకమైన పాత్రలో చరణ్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రా కోసం మోహన్ బాబును తీసుకుంటున్నారని తాజా సమాచారం. ఈ సినిమాలో కామెడీ టచ్ ఉన్న నెగిటివ్ రోల్ ఒకటి ఉందట. ఆ ప్రాంతం కోసం మోహన్ బాబును చిరంజీవి అడిగితె, కామెడీ టచ్ లేకుండా పూర్తి నెగిటివ్ శేష్ ఉన్న పాత్ర అయితే చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని మోహన్ బాబు అన్నారట.
దాంతో ఆ పాత్రను అలాగే డిజైన్ చేయమని చిరంజీవి చెప్పడంతో, కోరోటాల స్క్రిప్ట్ లో మార్పులు చేసే పనిలో ఉన్నాడని తెలుస్తుంది. పాత్ర నచ్చితే మోహన్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువని అంటున్నారు. గతంలో చిరు, మోహన్ బాబు ఇద్దరు కలసి చాలా సినిమాల్లో నటించారు.