Movies

గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న రష్మిక…రష్మిక ఫాన్స్ ఫీల్ అవుతున్నారట

రష్మిక మందన. ‘ఛలో’ సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన రష్మిక ‘గీత గోవిందం’ సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరైంది. ఇటీవల మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ నటించిన రష్మిక సూపర్ హిట్ అందుకుంది. తాజాగా నితిన్‌తో భీష్మలో నటించి, సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. రష్మిక ఆచార్యలో చరణ్ సరసన మెరవనుంది.

చిరంజీవి ప్రధాన పాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మాట్నీ ఎంటర్టైన్ మెంట్‌తో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మెసేజ్ ఓరియెంటెడ్‌గా వస్తోన్న ఈ చిత్రం.. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోంది. ఈ సినిమాతో పాటు రష్మిక ప్రస్తుతం బన్ని సరసన నటిస్తోంది. ఈ సినిమాను సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే నాని హీరోగా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా జెర్సీ ఇప్పుడు హిందీలో భారీ స్థాయిలోనే రీమేక్ అవుతోంది.

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట రష్మిక మందన ను తీసుకోవాలని మూవీ యూనిట్ భావించిందట. ఈమేరకు ఆమెను సంప్రదిస్తే.. ఆ ఆఫర్‌ను రష్మిక తిరస్కరించింది. అయితే షాహిద్ కపూర్ లాంటి స్టార్ సరసన బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఉంటే రష్మిక కెరీర్ ఇక ఓ రేంజ్‌లో ఉండేదని అది ఆమెకు ఎంతో ఉపయోగపడేదని అంత మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నందుకు ఆమె అభిమానులు బాగా బాధ పడుతున్నారట. ఆ బాలీవుడ్ ఆఫర్‌ను అంగీకరిస్తే హిందీలో కూడా బిజీ అయ్యేదని, బంగారంలాంటీ అవకాశాన్ని రష్మిక మిస్ చేసుకుందని ఆమె ఫ్యాన్స్ బాధ పడిపోతున్నారట. కందకులేని దురద కత్తిపీటకెందుకని కొందరు నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.