Movies

బాబాయ్ – అబ్బాయ్‌ల మ‌ధ్య న‌డుస్తున్న కోల్డ్ వార్‌కి ముగింపు ప‌లికిన‌ట్టేనా?

నంద‌మూరి బాలకృష్ణ – ఇద్ద‌రి మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తోంద‌న్న విష‌యాన్ని నంద‌మూరి అభిమానులు సైతం ఒప్పుకుంటారు. ఎన్నో ఏళ్లుగా వీరిద్ద‌రూ ఎడ‌మొహం, పెడ మొహంగా ఉంటూ వ‌చ్చారు. ఎన్టీఆర్ ట్వీట్స్‌లో బాల‌య్య గురించి గానీ, బాల‌య్య మాట‌ల్లో ఎన్టీఆర్ గురించి గానీ ఎలాంటి ప్ర‌స్తావ‌న రాలేదు. అయితే ఇప్పుడు ఈ కోల్డ్ వార్‌కి ఎన్టీఆర్ తెర దించే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు అనిపిస్తోంది. `బి ది రియ‌ల్ మేన్‌` పేరుతో సోష‌ల్ మీడియాలో ఓ ఛాలెంజ్ న‌డుస్తోంది. భార్య‌కు ఇంటి ప‌నుల్లో సాయం చేయ‌డ‌మే ఈ ఛాలెంజ్ ల‌క్ష్యం.

ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా ఛాలెంజ్‌ని స్వీక‌రించిన రాజ‌మౌళి… ఓ వీడియోని పోస్ట్ చేస్తూ రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల‌ను ఈ ఛాలెంజ్‌ని విసిరాడు. ఎన్టీఆర్ కూడా ఆ ఛాలెంజ్ అందుకున్నాడు. ఇంటి ప‌నులు చేస్తూ ఓ వీడియోని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి, ఆ ఛాలెంజ్ ని బాల‌య్య‌కు పాస్ చేశాడు. విసిరాడు. ఈ స‌వాల్ బాల‌య్య స్వీక‌రిస్తే గ‌నుక‌.. బాబాయ్ – అబ్బాయ్‌ల మ‌ధ్య న‌డుస్తున్న కోల్డ్ వార్‌కి కామా ప‌డింద‌ని అనుకోవొచ్చు. మ‌రి బాల‌య్య స్వీక‌రిస్తాడా? అన్న‌ది అనుమాన‌మే. ఈమ‌ధ్య బాల‌య్య ఎన్టీఆర్‌పై మ‌రింత గుర్రుగా ఉంటున్నాడ‌ని, ఈ స‌వాల్ ని బాల‌య్య స్వీక‌రించే ప్ర‌శ్నే లేద‌ని కొంత‌మంది బాల‌య్య అభిమానులు చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.