Movies

సురేష్ బాబు హీరో కాకపోవడానికి అసలు కారణం ఎవరో తెలుసా ?

టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి దగ్గుబాటి సురేష్ బాబు.తండ్రి రామానాయుడు వారసత్వాన్ని కొనసాగిస్తూ నిర్మాతగా ఓ వైపు చిన్న సినిమాలు, మరోవైపు పెద్ద సినిమాలు కూడా నిర్మిస్తున్న నిర్మాతగా సురేష్ బాబు కొనసాగుతున్నారు. రామానాయుడు వారసుడుగా విక్టరీ వెంకటేష్ హీరోగా పరిచయమై టాలీవుడ్ లో స్టార్ హీరోగా తనదైన ముద్ర వేశాడు.అయితే సురేష్ బాబు మాత్రం మొదటి నుంచి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ వ్యాపారాలు చేస్తూ వచ్చారు.

అలాగే సురేష్ ప్రొడక్షన్ సంస్థని కేవలం నిర్మాత సంస్థగానే ఉంచుకుండా థియేటర్లు నిర్మించి, అలాగే డిస్ట్రిబ్యూటర్ గా కూడా సంస్థ బ్రాండ్ పెంచే ప్రయత్నం చేశారు.కెరీర్ ఆరంభంలో హీరోగా అవకాశం వచ్చినా కూడా తనకు నటించాలని ఆసక్తి లేకపోవడంతో సున్నితంగా తిరస్కరించడం జరిగిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలియజేశారు.

యుక్త వయసులో ఉన్నప్పుడు తాను కమల్ హాసన్ లా ఉండేవాడిని, అలాగే కమల్ హాసన్ కారు తన కారు ఒకటే మోడల్ కావడంతో అందరూ నన్ను కమల్ హాసన్ అని అనుకునేవారని అన్నారు.అలాగే భారతీరాజా తనతో ఓ సినిమా చేయడానికి ముందుకు వచ్చారని, తనకి నటించాలనే ఆసక్తి లేకపోవడంతో సున్నితంగా తిరస్కరించడం జరిగిందని అన్నారు.మొదటి నుంచి నా ఆలోచనలు వ్యాపారం పైన ఉండడంవల్ల సినిమాల్లో నటించాలనే ప్రయత్నం కూడా చేయలేదు అని అన్నారు.అలా హీరోగా వచ్చిన అవకాశం కూడా వదులుకోవడం జరిగిందని సురేష్ బాబు తెలియజేశారు.