వకీల్ సాబ్ పారితోషికంలో చాలా మార్పులు జరిగాయట… కారణం అదేనట
పవన్ కళ్యాణ్ 26వ చిత్రం వకీల్ సాబ్.ఈ చిత్రం బాలీవుడ్ హిట్ మూవీ పింక్‌కు రీమేక్ అనే విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేయాలనుకున్నారు.ఈ చిత్రం కోసం పవన్ ఏకంగా 45 నుండి 50 కోట్ల వరకు పారితోషికంను తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.
అయితే కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో సినిమా ఎప్పుడు విడుదల అయ్యేది చెప్పలేని పరిస్థితి ఉంది.దాంతో పవన్ పారితోషికం విషయంలో మార్పులు జరిగినట్లుగా తెలుస్తోంది.సినిమా విడుదల ఈ ఏడాది ఉంటుందో లేదో తెలియదు.కనుక నిర్మాత దిల్‌రాజు భారీగా నష్టాల పాలయ్యే అవకాశం ఉంది.అందుకే ఆయన శ్రేయస్సు కోసం అని ఏకంగా 15 కోట్ల వరకు పారితోషికంను తగ్గించుకున్నట్లుగా తెలుస్తోంది.
సినిమాకు భారీగా బిజినెస్ అయ్యే పరిస్థితి లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. పవన్ గతంలో కూడా ఇలా పారితోషికంను రిటర్న్ ఇచ్చిన దాఖలాలు చాలానే ఉన్నాయి.
దిల్‌రాజు ఈ చిత్రం మాత్రమే కాకుండా వి సినిమాపై కూడా దాదాపుగా 30 కోట్లు పెట్టుబడి పెట్టి ఉన్నాడు.
ఆ సినిమా కూడా దిల్‌రాజుకు నష్టాలు మిగిల్చే అవకాశం ఉంది.కనుక పవన్ మంచి మనసుతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు.అతి త్వరలోనే ఈ సినిమా మిగిలిన బ్యాలన్స్‌ను పూర్తి చేసి పరిస్థితులు కుదుట పడ్డ తర్వాత విడుదలకు రెడీ చేసే అవకాశం ఉంది అంటున్నారు.