రణ్ వీర్ సినిమాకి ఎన్ని కోట్లకు స్ట్రీమింగ్ యాప్ బేరం చేసిందో తెలుసా?
సినిమాలకు,క్రికెట్ కి ఒక అవినాభావ సంబంధం ఉంది. స్టార్ హీరోయిన్స్ క్రికెట్ వీరులను పెళ్లాడిన ఘటనలు ఉన్నాయి. క్రికెట్ వీరుల మీద సినిమాలు వచ్చాయి. వస్తాయి కూడా. ఎందుకంటే, క్రికెట్ అంటే భారత్ లో ఓ మానియా .. ఐపీఎల్ అయినా.. ఇండియన్ క్రికెట్ అయినా పిచ్చిగా చూస్తారు. అందుకే క్రికెట్ లేని భారత్ ను అస్సలు ఊహించలేం. ప్రపంచ క్రికెట్ లో భారత్ కి సంబంధించి కపిల్ దేవ్ నేతృత్వంలో 1983లో ప్రపంచకప్ గెలవడం.. ఆ తర్వాత ఎంఎస్ ధోని నేతృత్వంలో 2011లో ఇదే ప్రపంచకప్ ను సాధించడం . ఈ రెండు విజయాలు ప్రపంచ క్రికెట్ లోనే అద్భుత ఘట్టాలు.
కపిల్ దేవ్ నేతృత్వంలో 1983లో దేశానికి వరల్డ్ కప్ అందించి, దేశానికి హీరోగా నిలిచారు. ఈ నేపథ్యంలో నాటి అపూర్వఘట్టాన్ని తెరపై చూపించడానికి రంగం సిద్ధమైంది. దీన్ని సినిమాగా 1983 విజయాన్ని తీస్తున్నారు. రణ్ వీర్ సింగ్ హీరోగా ‘83’ పేరుతో రూపొందిన ఈ హిందీ సినిమాకు ఇప్పుడు దేశంలో ఫుల్ క్రేజ్ ఉంది. లాక్ డౌన్ తో విడుదల వాయిదా పడిన ఈ మూవీ కోసం ఆడియన్స్ లో ఉత్కంఠ నెలకొంది.
ఇప్పటికే ధోని బయోపిక్ కు కలెక్షన్ల వర్షం కురిసింది. ఇప్పుడు అదే బాటలో రణ్ వీర్ ‘83’కి ఫుల్ క్రేజ్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమాకు ఓ వెబ్ స్ట్రీమింగ్ యాప్ వాళ్లు బంపర్ ఆఫర్ ఇచ్చారట. లాక్ డౌన్ తో విడుదల వాయిదా పడిన ఈ సినిమాను తమ స్ట్రీమింగ్ యాప్ ద్వారా విడుదల చేస్తే 144 కోట్ల రూపాయాల మొత్తాన్ని ఇస్తామని ఆఫర్ చేశారట. ఈ సినిమాను వారు కొనుగోలు చేయడానికి రెడీ అయ్యారని టాక్. అయితే 83 నిర్మాతలు మాత్రం దీన్ని థియేటర్స్ లోనే విడుదల చేయాలని దేశవ్యాప్తంగా 500 కోట్లకు పైగా రాబట్టాలని వెయిట్ చేస్తున్నారట.