Movies

ఈ చిన్నప్పటి స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా…?

తెలుగులో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన “ఏం మాయ చేశావే” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయినటువంటి సమంత అక్కినేని గురించి తెలియని వారుండరు.అయితే ఈమె వచ్చీ రావడంతోనే పర్వాలేదనిపించినప్పటికీ టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, నేచురల్ స్టార్ నాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదితర స్టార్ హీరోల చిత్రాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది.

దీంతో ఈ అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ గా కొనసాగుతోంది.అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అక్కినేని సమంత తన అభిమానులతో మరింత అందుబాటులో ఉంటోంది.ఇందులో భాగంగా ఇటీవల కాలంలో సమంత తన చిన్నప్పుడు తన తల్లితో తీసుకున్నటువంటి ఓ ఫోటోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అంతేగాక అతి కొద్దికాలంలోనే లక్షలకు పైగా లైకులు వచ్చాయి.అలాగే సమంత అభిమానులు చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉన్నావు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సమంత తమిళంలో ప్రముఖ దర్శకుడు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే తెలుగులో టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది.ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు.ఈ చిత్రం తొందర్లోనే పట్టాలెక్కి సూచనలు కనిపిస్తున్నాయి.