హైపర్ ఆది జీవితంలో అనసూయకు ప్రత్యేక స్థానం ఉందట…షాకింగ్ నిజాలు చెప్పిన ఆది
ఏడెనిమిదేళ్లు గడిచినా ఈటీవీలో వస్తున్న జబర్దస్త్ కామెడీ షో ఇప్పటికీ టిఆర్పి రేటింగ్ ఏమాత్రం తగ్గకుండా దూసుకెళ్తోంది. ఈ షో ద్వారా చాలా మంది ఆర్టిస్టులు పరిచయం అయ్యారు. ఇంకా అవుతున్నారు. ఆర్ధికంగా కూడా నిలదొక్కుకున్నారు. ఇక ఈ షోకి అనసూయ యాంకరింగ్ అదిరిపోతోంది. కంటెస్టెంట్స్ లో హైపర్ ఆది కి గల ఫాలోయింగ్ వేరు. ఇక ఆది, అనసూయ మధ్య ఉండే కెమిస్ట్రీ మాత్రం స్పెషల్ గా ఉంటుందని చెప్పాలి. నిజానికి వాళ్లిద్దరి మధ్య ఆకాశం, నేలకు ఉన్నంత తేడా ఉంటుంది. తాజాగా ఆయన అనసూయకు ప్రత్యేక స్థానం ఉందన్నారు.
జబర్దస్త్ షోలో యాంకర్ స్థానంలో అనసూయ కూర్చుందంటే చాలు, ఇక హైపర్ ఆది ఆమెపై పంచుల మీద పంచు లు విసురుతాడు. ఇక అనసూయ అందాన్ని పొగిడేస్తూ రక్తి కట్టిస్తుంటాడు. ఈమధ్య ఆ పంచ్ లలో రొమాంటిక్ డోస్ కూడా హెచ్చుతోంది. ఆ మధ్య ఆదిని అనసూయ బావా అంటూ వయ్యారంగా పిలవడం ఇంకా జబర్దస్త్ ప్రేక్షకుల మదిలో ఉంది. తన జీవితంలో అనసూయకు ప్రత్యేక స్థానం ఉందని, ఆమెతో స్కిట్స్ విషయంలో కొంచెం రొమాంటిక్ టచ్ ఇచ్చినా.. నిజ జీవితంలో మాత్రం ఆమె అంటే ఎంతో రెస్పెక్ట్ ఉందని ఆది చెప్పాడు.
ఒక నిబద్ధత గల యాంకర్‌గా మా కమెడియన్స్‌కు ఆమె ఎనర్జీ మాకు బలం అని ఆది అన్నారు. ‘నా జీవితంలో జబర్దస్త్ ఓ భాగం. అందువల్లే నేనీ స్థానంలో ఉన్నాను. ఆ జబర్ధస్త్ షోతోనే అనసూయ కూడా పాపులర్ అయింది. అమె వల్ల ఈ షోకు కొంచెం గ్లామర్ టచ్ వచ్చింది అది వేరే విషయం. కానీ నేను వేసే సెటెర్లను ఆమె స్పోర్టివ్‌గా తీసుకుంటోంది. అందుకే ఆమె అంటే తనకు ఎంతో స్పెషల్’అంటూ హైపర్ ఆది చెప్పుకొచ్చాడు.