Movies

యూట్యూబ్ లో నితిన్ మ్యానియా..మరో 100 మిలియన్.!

మన టాలీవుడ్ యూత్ స్టార్ హీరో నితిన్ కు మన దగ్గర ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. తన అభిమాన హీరో పవన్ కు ప్లాప్స్ లో తాను అండగా ఉన్నాడో తాను ప్లాప్స్ లో ఉన్నపుడు తనకి తన అభిమానులు అండగా నిలబడ్డారు. అయితే మన దగ్గర నితిన్ సినిమాల క్రేజ్ ను అటుంచితే నార్త్ లో మాత్రం నితిన్ సినిమాలను యమ క్రేజ్ ఉందని చెప్పాలి. నితిన్ కెరీర్ లో రీసెంట్ గా హిట్ అయిన సినిమాలు ప్లాప్ అయిన సినిమాలకు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.

అలా తాను తాజాగా నటించిన “శ్రీనివాస కళ్యాణం” సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ 100 మిలియన్ వ్యూస్ మార్క్ ను క్రాస్ చేసింది. దీనితో నితిన్ కెరీర్ లో మొత్తం నాలుగు సినిమాలు “అ ఆ”, “లై”, “ఛల్ మోహన రంగ” లతో కలిపి నాలుగు 100 మిలియన్ వ్యూస్ దాటిన సినిమాలు నితిన్ కు సొంతం అయ్యాయి. అయితే వీటిలో ప్లాప్ అయిన సినిమాలే మూడు ఉండడం గమనార్హం. దీనిని బట్టి హిందీ ప్రేక్షకుల్లో నితిన్ సినిమాలకు మంచి డిమాండ్ ఉందని మరోసారి ప్రూవ్ అయ్యింది.