Movies

పవర్ స్టార్ కి ఆ బిరుదు ఇచ్చింది ఎవరో తెలుసా ?

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నాడు. ఇంకా చెప్పాలంటే తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పవన్ కళ్యాన్ ఏకంగా పవర్ స్టార్ అయ్యాడు. అతి తక్కువ కాలంలో పవర్ స్టార్ అవ్వడం వెనక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందట. ఇక ‘‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా తో పవన్ ఎంట్రీ ఇచ్చాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇవివి సత్యనారాయణ డైరెక్ట్ చేసారు. అయితే ఇండస్ట్రీలో లోకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ పేరు.. కళ్యాణ్ కుమార్ గా ఉండేది. హీరోగా రాకముందు కూడా తన చిన్న అన్నయ్య నాగబాబు.. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మించిన పలు చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించాడు.

అయితే హీరోగా పవన్ కళ్యాణ్ మొదటి చిత్రం అంతగా నడవలేదు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్.. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ‘గోకులంలో సీత’ సినిమా చేసాడు. ఈ చిత్రం తమిళంలో హిట్టైన ‘గోకులతై సీతై’ సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టైయింది. ఇక ఆ చిత్రానికి పోసాని కృష్ణమురళి మాటలు అందించారు. అయితే పేరు కూడా పవన్ కళ్యాణ్ ఆ మార్చుకున్నాడు. ఇక ఈ సినిమా విడుదల సందర్భంగా పోసాని కృష్ణమురళి తొలిసారిగా విలేకరుల సమావేశంలో పవన్ కల్యాణ్‌ను పవన్ స్టార్ అని సంబోధించారు. ఆ తర్వాత చాలా పత్రికలు పవన్ కళ్యాణ్ పేరు ముందు పవర్ స్టార్ బిరుదు చేర్చిసాయి.

ఆ తర్వాత సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో వచ్చిన ‘సుస్వాగతం’ సినిమాలో తొలిసారిగా పవన్ కళ్యాన్ పేరుకు ముందు పవర్ స్టార్ బిరుదుతో టైటిల్ వేసారు. ఇలా పవన్ కల్యాణ్.. పవర్ స్టార్ పేరు పెట్టడం వెనక పోసాని కృష్ణమురళి నోటి వాక్కు ఉంది. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్‌తో పాటు పోసాని కూడా ప్రస్తావించారు. అయితే బిరుదుకి తగ్గట్టుగా తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్‌గా తన సత్తా చాటుతూనే రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేస్తున్నాడు.