Movies

ఒకప్పటి ఈ స్టార్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా….?

తెలుగులో “దేవి” అనే చిత్రంలో నాగలోక యువతిగా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి హీరోయిన్ “ప్రేమ” గురించి సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.ఈమె అప్పట్లో విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, వడ్డే నవీన్, వేణు తొట్టెంపూడి ఇతర హీరోలతో కలిసి పనిచేసింది.

ఈ అమ్మడు తెలుగులో కంటే కన్నడ భాషలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే తాజాగా నటి ప్రేమ ప్రముఖ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొంది.ఇందులో భాగంగా తన జీవితానికి సంబంధించి నటువంటి కొన్ని సంఘటనల గురించి ప్రేక్షకులతో తెలిపింది.అయితే ఇందులో భాగంగా తెలుగులో తాను మొదటిగా విక్టరీ వెంకటేష్ హీరోగా నటించినటువంటి ధర్మచక్రం అనే చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయ్యానని, తనని వచ్చీరావడంతోనే తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారని అందుకు వారికి జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపింది.

అయితే కార్యక్రమంలో భాగంగా కొంతమంది అభిమానులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానమిచ్చింది.ఇందులో మీకు మళ్లీ సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశం వస్తే నటిస్తారా…? అని అడగ్గా అందుకు ప్రేమ చెబుతూ “కచ్చితంగా నటిస్తానని, అంతేగాక తన పాత్రకి ప్రాధాన్యత ఉన్నటువంటి అవకాశం వస్తే ఏ పాత్రలోనైనా నటించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది.అయితే మరో అభిమాని మీకు “ప్రభాస్ తో నటించే అవకాశం వస్తే నటిస్తారా…?” అని అడగగా, తప్పకుండా నటిస్తానని చెప్పుకొచ్చింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో వరుస సినిమాల్లో ప్రేమ నటించినప్పటికీ కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో హీరోయిన్ గా నిలదొక్కు కొలేకపోయింది.దాంతో 2006వ సంవత్సరంలో ఓ ప్రముఖ వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది.అయితే ఈ మధ్యకాలంలో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు, గొడవలు రావడంతో విడాకులు తీసుకున్నట్లు సమాచారం.ప్రస్తుతం ప్రేమ కర్ణాటకలోని బెంగళూరు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి తన సొంత నివాసంలో ఉంటుంది.