యూట్యూబ్ టాప్ 10 లో నాలుగు తారక్ వే..!
నిన్న యంగ్ టైగర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాను హోరెత్తించారు తారక్ అభిమానులు మన దేశంలోనే ఏ హీరోకు జరపని రేంజ్ లో విషెస్ చెప్పి తమ అభిమానాన్ని చాటుకున్నారు.అయితే తారక్ కు అభిమానులు సినిమా తారలతో పాటు పలు నిర్మాణ సంస్థలు వారు కూడా తమదైన శైలిలో విషెష్ తెలిపారు. వీరితో పాటు బిగ్ బాస్ 1 కంటెస్టెంట్స్ కూడా విషెస్ తెలిపిన వీడియో ఒకటి వచ్చింది.
హారిక హాసిని వారు, సురేష్ ప్రొడక్షన్స్ వారు అలాగే శ్రేయాస్ మీడియా వారు తార పుట్టిన రోజు సందర్భంగా విషెస్ తెలుపుతూ తమ యూట్యూబ్ ఛానెల్స్ లో ఆ వీడియోస్ ను వదలగా మొత్తం ఈ నాలుగు యూట్యూబ్ టాప్ 10 లో ట్రెండ్ అవుతున్నాయి.వీటిలో అయితే బిగ్ బాస్ 1 కంటెస్టెంట్స్ ఇచ్చిన వీడియో టాప్ 5 లో ట్రెండ్ అవుతుంది. ఇలా టాప్ 10 లో మొత్తం నాలుగు వీడియోలు ఒక్క ఎన్టీఆర్ వే ఉండడం విశేషం.