Movies

అల్లు అర్జున్ కి ఎన్ని వేల కోట్ల ఆస్థి ఉందో తెలుసా?

టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు.అయితే ఇతడు టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ కొడుకు అయినప్పటికీ సినిమాల్లో మాత్రం తన సొంత టాలెంట్ ని ఉపయోగించుకుని ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు.

అలాగే ఎంతటి కఠిన తరమైన డాన్స్ స్టెప్పులయినా సరే సునాయాసంగా చేయడం అల్లు అర్జున్ యొక్క స్పెషాలిటీ.అయితే ఈ మధ్య కాలంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే అల్లు అర్జున్ యొక్క వ్యక్తిగత ఆస్తుల వివరాలు దాదాపుగా 1500 కోట్ల రూపాయలకు పైగా ఉంటాయని పలు వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.అయితే అల్లు అర్జున్ వాడేటువంటి ఖరీదైన వస్తువులను చూస్తే ఇది నిజమేనని అనిపించక మానదు.

ఇందులో ముఖ్యంగా అల్లు అర్జున్ వాడే టువంటి కార్ల విషయానికి వస్తే బీఎండబ్ల్యూ, రేంజ్ రోవర్, జాగ్వర్, ఆడీ, టయోటా క్రూజర్ వంటి హై ఎండ్ కార్లు అల్లు అర్జున్ షెడ్ లో ఉన్నాయి.ఇక అల్లు అర్జున్ ధరించే బట్టల విషయానికి వస్తే అల్లు అర్జున్ కోసమే ప్రత్యేకంగా ఒక కాస్ట్యూమ్ డిజైనర్ ఉన్నాడట.

అంతేగాక అల్లు అర్జున్ కి పలు ఐటీ సంస్థలు మరియు ఇతర వ్యాపారాలలో కూడా బాగానే పెట్టుబడులు ఉన్నట్లు ప్రస్తుతం టాలీవుడ్ లో అందరూ చర్చించుకుంటున్నారు.దీనికి తోడు సినిమాల పరంగా కూడా అల్లు అర్జున్ ఒక సినిమాకి దాదాపుగా 18 నుంచి 20 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని, పైగా అతని తండ్రి కూడా టాలీవుడ్ లో పేరు మోసిన బడా నిర్మాతగా కావడంతో ఆ మాత్రం ఆస్తులు ఉంటాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అల్లు అర్జున్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నటువంటి పుష్ప అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించినటువంటి షూటింగ్ పనులు కేరళ రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో జరుగుతున్నాయి.కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తుండగా, ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో బాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నాడు.