ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా?
మలయాళీ ముద్దుగుమ్మ మీరా జాస్మిన్ ‘రన్’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చినా, పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘గుడుంబా శంకర్’ లో నటించిన మీరా జాస్మిన్ తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. ‘భద్ర’, ‘అమ్మాయి బాగుంది’ వంటి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన కెరీర్ బాగానే ఉన్న సమయంలో 2014 లో వివాహం చేసుకొని సినిమాలకు దూరం అయింది. కేరళ అమ్మాయి అయినా తెలుగింటి అమ్మాయిలా కన్పించటం వలన తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. తెలుగు, తమిళ, మళయాళ సినిమాలన్నిటిలో ఛాన్సులు దక్కించుకుని అప్పట్లో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.
మీరా ఇప్పుడు చూడటానికి చాలా బొద్దుగా తయారైంది.తాజాగా ఆమె ఓ జువెలరీ షాప్ లో తళుక్కుమంది. హీరోయిన్ గా ఉన్నప్పుడు ఎంతో నాజూకుగా ఉన్న ఇప్పుడు ఆమె గుర్తు పట్టలేకుండా ఉంది. అయినప్పటికీ చీర కట్టులో ఎంతో హుందాగా, అందంగా కనిపించింది. ప్రస్తుతం ఆమె తాజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.