‘సర్కార్ వారి పాట’ సినిమాలో మహేష్ లుక్ సీక్రెట్ ఇదే
Sarkaru Vaari Paata First Look
సరిలేరు నీకెవ్వరు మూవీ తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా చేస్తున్న 27వ సినిమా టైటిల్ `సర్కార్ వారి పాట` గా తేలింది.
మొత్తానికి టైటిల్ మ్యాటర్ ముందుగానే లీకవడంతో ఇక తాజాగా ఈ టైటిల్ ని చిత్రబృందం అధికారికంగా ఖరారు చేసేసింది కూడా.
గీతా గోవిందం ఫేమ్ పరుశురామ్ దర్శకత్వం వహిస్తుండగా మైత్రీమూవీమేకర్స్- జీఎమ్బీ ఎంటర్ టైన్ మెంట్స్- 14 రీల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి.
తమన్ సంగీతం, పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో మహేశ్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే చిత్రబృందం నుంచి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.అసలు పరశురామ్ ఎంచుకున్న కథాంశంపైనా మరింత క్లూ కూడా రివీల్ కావాల్సి ఉంది.
ఈనేపధ్యంలో టైటిల్ తో పాటు పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. పైగా సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు కానుకగా కృష్ణ-మహేష్ అభిమానులకు మైత్రి-14 రీల్స్ సంస్థలు కానుకగా టైటిల్ పోస్టర్ ని సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.
అయితే ఈ పోస్టర్ లో మహేష్ పూర్తి లుక్ మాత్రం రివీల్ కాకపోవడం వెనుక సీక్రెట్ ఉందట.
కేవలం వెనక వైపుగా హాఫ్ లుక్ ని ఓపెన్ చేశారు. ఆ చెవికి రింగు, రఫ్ గా కనిపించేలా గడ్డం, బ్లాక్ షర్ట్, ఫ్రీ హెయిర్ స్టైల్ తో మహేష్ మాస్ గా దర్శనమిస్తున్నాడు.
ఇక టైటిల్ పరమార్థాన్ని ప్రతిబింబించేలా ఆ మెడపై రూపాయి కాయిన్ టాటూ కూడా ఉండనే ఉంది. ఈ మూవీకి ఆ పాయింట్ చాలా కీలకం అంటున్నారు.
ఇక మహేష్ ఈ చిత్రంలో మూడు విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తాడని ప్రచారమవుతోంది.
యంగ్ కాలేజ్ బోయ్ లుక్ తో పాటు, రకరకాల ఏజ్ లలో డిఫరెంట్ లుక్ తో ట్రీట్ మెంట్ ఇస్తాడని ప్రచారం మహేష్ అభిమానుల్లో పుష్కలంగా ఉంది.
అందుకు తగ్గట్టే ఈ లుక్ యంగ్ ఏజ్ కి చెందిందన్న టాక్ నడుస్తోంది.
అయితే మహేష్ పూర్తి లుక్ ని కూడా తదుపరి రిలీజ్ చేయనున్నారట. అతడి లుక్ సూపర్భ్ గా ఉంటుందని ఫాన్స్ ఉబలాట పడుతున్నారు.