రానా పెళ్లి ఎప్పుడో తెలుసా?
టాలీవుడ్‌లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో రానా ఒకడు. రానా పెళ్లెప్పుడు? అనేది హాట్ టాపిక్‌గా నడిచేది. కానీ సడన్‌గా రానా.. తన పెళ్లి కబురు చెప్పేశాడు. కాబోయే శ్రీమతినీ పరిచయం చేసేశాడు.
అంతలోనే నిశ్చితార్థం జరిగిపోయింది. ఇప్పుడు పెళ్లొక్కటే బాకీ. అందుకు ముహూర్తమూ కుదిరేసింది.
ఆగస్టు 7 రానా పెళ్లి. కరోనా ఇబ్బందుల వల్ల హైదరాబాద్‌లోనే పెళ్లి చేయాలని రానా కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
ఆగస్టు 6న సంగీత్ జరుగుతుంది. ఈ వివాహ వేడుకలకు పరిమిత సంఖ్యలోనే అతిథులు హాజరవుతారు.
కేవలం కుటుంబ సభ్యుల, కొంతమంది అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరగబోతోంది.
తెలుగు, మార్వాణీ సంప్రదాయాల ప్రకారం ఈ పెళ్లి జరగబోతోందని, సింపుల్ గా పెళ్లి చేస్తున్నామని సురేష్ బాబు తెలిపారు.
మిహీకాని రానా ప్రేమించిన సంగతి తెలిసిందే. మిహీకాది మార్వాడీ కుటుంబం.