రామ్ చరణ్ కి కష్ట కాలం…టైమ్ అసలు కలిసి రావటం లేదు
చిరంజీవి 150వ సినిమాకి నిర్మాత ఎవరు? ఆ లక్కీ ఛాన్స్ ఎవరిది? అనుకుంటున్నప్పుడు రామ్ చరణ్ ముందుకొచ్చాడు. `
నా డాడీ సినిమాకి నేనే నిర్మాత` అంటూ కొణిదెల ప్రొడక్షన్స్ పేరుమీద ఓ సంస్థని స్థాపించి, ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని నిర్మించాడు.
ఆ సినిమాతో చరణ్‌కి మంచి లాభాలు కూడా వచ్చాయి. తొలి ప్రాజెక్టుతోనే మంచి హిట్టు కొట్టినందుకు చరణ్ కూడా సంబరపడ్డాడు.
అయితే ఆ సంతోషం అట్టే నిలవలేదు. భారీ బడ్జెట్ సినిమా ‘సైరా’ని నెత్తిమీద వేసుకున్నాడు చరణ్.
చిరు కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్ అయిన సినిమా ఇది. కానీ.. రాబడి ఆ స్థాయిలో రాలేదు. ఈసినిమాతో చరణ్ కనీసం 50 కోట్లు పోగొట్టుకుని ఉంటాడని టాక్.
దాన్ని రాబట్టుకోవడానికి ఇప్పుడు `ఆచార్య` మొదలెట్టాడు. అయితే `ఆచార్య`కీ టైమ్ కలసి రావడం లేదు. ఈ సినిమాకి కూడా ఎన్నో అవాంతరాలు.
ముందు అనుకున్న బడ్జెట్ ఒకటి. ఇప్పుడు లెక్కతేలుతోంది మరోటి. కోరోనా వల్ల షూటింగ్ ఆగిపోయింది. ఈ యేడాది విడుదల కావడం కష్టమే. 2021 జనవరిలోనూ రాలేని పరిస్థితి. 2021 వేసవిలో విడుదల చేద్దామనుకుంటే `ఆర్.ఆర్.ఆర్` పొంచి ఉంది.
ఆ సినిమాలోనూ చరణ్ ఉంటాడు. ఆచార్యలోనూ ఉంటాడు. కాబట్టి రెండు సినిమాల మధ్య కనీసం రెండు నెలల గ్యాప్ అవసరం.
ఆర్.ఆర్.ఆర్ పూర్తయ్యాకే ఈ సినిమాకి చరణ్ కాల్షీట్లు ఇవ్వగలడు. ఆర్.ఆర్.ఆర్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియనప్పుడు – ఆచార్యని ఎలా ముగిస్తాడు? అలా నిర్మాతగానూ, నటుడుగానూ చరణ్‌కి తలనొప్పులు మొదలయ్యాయి. మరి ఇవి ఎప్పటికి తీరతాయో?