భారీ ధరకి అమ్ముడుపోయిన లవ్ స్టొరీ రైట్స్…ఎన్ని కొట్లో…?
Sai Pallavi Love Story Movie Rights Sold Out
ఫిదా సినిమాతో తెలుగులో సూపర్ సక్సెస్ అందుకొని తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకని సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్న భామ సాయి పల్లవి.
ఈ భామ మరోసారి తన మొదటి సినిమా దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టొరీ సినిమాలో నటిస్తుంది.
ఇందులో సాయి పల్లవి, చైతూతో జత కట్టింది.ఫిదా కాంబినేషన్ కావడంతో పాటు, సాయి పల్లవికి ఉన్న ఇమేజ్ కారణంగా సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.
చైతూ కూడా మజిలీ, వెంకీ మామ లాంటి హిట్స్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో దీనిమీద పాజిటివ్ టాక్ ఉంది.శేఖర్ కమ్ముల సినిమాలు అంటే ఎమోషనల్ ఎలిమెంట్ పెర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది.
అలాగే ఆడియన్స్ భాగా కనెక్ట్ అవుతారు అనే గుర్తింపు ఉంది.ఈ నేపధ్యంలో సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే సినిమా మార్కెట్ అయిపొయింది.
లవ్ స్టోరీ చిత్రానికి సంబంధించిన శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి.ఈ హక్కులు మొత్తం 16 కోట్లకు అమ్ముడైనట్టు సమాచారం.
ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని ఆహ సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమా ఆగష్టులో థియేటర్లలో విడుదల కావచ్చని తెలుస్తుంది.