ఆచార్య పరిస్థితి ఏమిటో తెలుసా…కొత్త కష్టాలు వచ్చాయా…?
Acharya movie status worrying fans
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ చిత్రం ‘ఆచార్య’ ఇప్పటికే షూటింగ్ వేగంగా జరిగినా లాక్ డౌన్ తో ఆగింది.
గతంలో సైరా నరసింహారెడ్డి వంటి హిస్టారికల్ చిత్రంతో వచ్చిన చిరు, ఈసారి పూర్తి మాస్ మసాలా మూవీతో మనముందుకు రావడానికి రెడీ అయ్యాడు.
ఈ సినిమాలో చిరు సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
ఈ సినిమాతో మెగాస్టార్ మరోసారి తన స్టామినా ఏమిటో తెలుగు బాక్సాఫీస్‌కు చూపించబోతున్నాడని అంటున్నారు.
ఈ సినిమా ఫక్తు కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్ది మరోసారి కమర్షియల్ సినిమాలకు బాస్ గా చూపించబోతున్నారు.
ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఈ సినిమాకు ‘ఆచార్య’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేయకముందే చిరు నోట వెలువడడంతో ఫాన్స్ లో ఉత్సాహం ఉరకలేసింది.
ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఆచార్యకు కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ రూపంలో పెద్ద అవాంతరం వచ్చి ,సినిమా షూటింగ్ దాదాపు రెండు నెలలకు పైగా వాయిదా పడింది.
ఈ సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చిందనే ఆందోళన ప్రేక్షకుల్లో ఉండడంతో చిత్ర యూనిట్ ఈ సినిమా 40 శాతం పూర్తయ్యిందని అంటోంది.
అయితే కేవలం 20 శాతం మాత్రమే ఆచార్య సినిమా పూర్తయ్యిందని,ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉందని ఫిలిం నగర్‌లో టాక్ వినిపిస్తోంది.
ఆచార్య సినిమా షూటింగ్ విషయంలో అసలు ఏం జరుగుతోందని మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
ఏది ఏమైనా అనుకున్న సమయానికి చిత్రాలను రిలీజ్ చేసే కొరటాల శివ ఈ సినిమా విషయంలో మౌనంగా ఉంటున్నాడు.
అందుకే మెగా ఫాన్స్ లో ఆందోళన కూడా నెలకొంది.
ఈ సినిమా 2020లో రిలీజ్ అవుతుందా లేదో అనేది అప్పుడే చెప్పలేం.