మోక్షజ్ఞ భారీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? ఆ ఛాన్స్ ఎవరిదో తెలుసా ?
అందరు వారసులు రంగప్రవేశం చేస్తుంటే, నందమూరి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ హీరో అవుతాడా అవ్వడా? అన్న సందేహాలు అలానే ఉన్నాయి. అసలు మోక్షజ్ఞకు సినీరంగం అంటే అంత ఆసక్తి లేదని అతడు హీరో అవ్వడని ఇటీవల ప్రచారమైంది. మోక్షజ్ఞ ఎంతమాత్రం తన రూపంపై శ్రద్ధ కనబరచడం లేదని ఫోటో ప్రూఫ్ లను బయటపెట్టారు.అయితే అదంతా గతం. వర్తమానంలో మోక్షజ్ఞ సినీ ఆరంగేట్రానికి సమయం ఆసన్నమైందన్న టాక్ లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చింది. నిజానికి దశాబ్ధం క్రితమే నందమూరి వారసుడు మోక్షజ్ఞ సినీఎంట్రీపై ఆసక్తికర చర్చ నడిచింది. అయితే అప్పటికి మోక్షు స్టడీస్ కొనసాగిస్తాడని బాలయ్య తేల్చిచెప్పేసాడు.
ఆ తర్వాత 2017లో మోక్షజ్ఞ సినీఎంట్రీ ఉంటుందని ఇంకో బలమైన ప్రచారం మొదలైంది. ఈ తరహా ప్రచారం అయితే ఫాన్స్ నుంచి కాకుండా నేరుగా బాలయ్య వ్యక్తిగత టీమ్ నుంచి ఎక్కువగా వచ్చింది. ఇది నిజమేనని, ఇక మోక్షు ఎంట్రీకి ఎంతో సమయం లేదని ఫాన్స్ అంతా భావించారు. కానీ 2020 వచ్చేసినా సరే, అతడి ఎంట్రీపై ఎలాంటి క్లారిటీ లేదు.నందమూరి అభిమానుల్లో ఈ మూడేళ్లలో నిరంతరం మోక్షజ్ఞ సినీఎంట్రీ గురించే చర్చ నడుస్తూనే ఉంది.
కానీ మరోసారి నిరాశ తప్పలేదు. అయితే తాజాగా నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ అవసరం మేర రూపురేఖల్ని మార్చుకుంటూ నట శిక్షణ తీసుకుంటున్నాడని త్వరలోనే ఎంట్రీ ఉంటుందని గుసగుసలు విన్పిస్తున్నాయి. ఇంతకీ అతడిని వెండితెరకు పరిచయం చేసే ఛాన్స్ ఎవరిదా అని ఆలోచిస్తుంటే, పరిశ్రమలో స్టార్ రైటర్ బుర్రా సాయిమాధవ్ కి ఆ బాధ్యతను అప్పజెప్పారని టాక్. దర్శకుడు క్రిష్ ఆస్థాన రచయితగా పాపులరైన సాయి మాధవ్ ఇటీవల పలు బ్లాక్ బస్టర్ చిత్రాలకు మాటలు అందించారు. మెగాస్టార్ నటించిన పాన్ ఇండియా మూవీ `సైరా: నరసింహారెడ్డి` రైటింగ్ టీమ్ లో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం రాజమౌళితో ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ చిత్రానికి రచయితగా కొనసాగుతున్నారు. అందుకే తన కొడుకు ఎంట్రీకి అవసరమైన కథకోసం సాయి మాధవ్ ని బాలయ్య సెలక్ట్ చేసుకున్నాడని టాక్.