సెలబ్రిటీ పెళ్ళిళ్ళు – ప్లస్సులు మైనస్సులు
లాక్ డౌన్ వల్ల షూటింగులు, ధియేటర్లే కాదు తారల వ్యక్తిగత జీవితాలు కూడా ప్రభావం చెందుతున్నాయి. ముఖ్యంగా పెళ్ళిళ్ళ విషయంలో మంచి ముహూర్తాలు వదులుకోవడం ఇష్టం లేని యాక్టర్లు సైలెంట్ గా నిబంధనలకు లోబడి సిటీ ఔర్ స్కర్ట్స్ లోని ఫాం హౌస్ లలో చేసేసుకుంటున్నారు. నిన్న నిఖిల్ పెళ్లి చాలా నిరాడంబరంగా జరిగిపోయింది. టాలీవుడ్ లో బాగా క్లోజ్ ఉన్న ఫ్రెండ్స్ కూడా వీడియోలు, ఫోటోలు చూసి ఆనందించాల్సి వచ్చింది. దిల్ రాజు సైతం తన సెకండ్ మ్యారేజ్ ని సింపుల్ గా చేసుకోక తప్పలేదు.
రంగస్థలంలో రామ్ చరణ్ అసిస్టెంట్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న శతమానంభవతి మహేష్ కూడా ఇదే బాట పట్టక తప్పలేదు. ఇప్పటి ముహూర్తాలు వదులుకుంటే మళ్ళీ డిసెంబర్ దాకా లేకపోవడంతో తొందరపడక తప్పలేదు. రానా తన కాబోయే భార్యను సోషల్ మీడియాలో పరిచయం చేశాక పెళ్లెప్పుడా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇంకా నితిన్ పెళ్లి బాకీ ఉంది. మొన్న ఏప్రిల్ లో దుబాయ్ లో ప్లాన్ చేసుకుంటే కరోనా దెబ్బకు ఇప్పటికీ డేట్ సెట్ చేసుకోవడం సాధ్య పడలేదు. ఇండస్ట్రీ పెద్దలతో పాటు అభిమానుల సమక్షంలో మూడు ముళ్ళు వేయాలనే ఆకాంక్షకు కరోనా పరిణామాలు పెద్ద బ్రెకే వేశాయి.
ఇదంతా పక్కన పెడితే ఇలా సింపుల్ పెళ్లిళ్ల వల్ల నష్టపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. గ్రాండ్ ఈవెంట్స్ గా జరిగే స్టార్ల వివాహాల వల్ల కొన్ని వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. అదంతా ఇప్పుడు మిస్ అయినట్టే. దానికి తోడు టీవీ ఛానల్స్ లైవ్ టెలికాస్ట్ రూపంలో సినిమా ప్రముఖులందరిని ఒకే సారి చూసుకునే ఛాన్స్ కూడా ప్రేక్షకులకు మిస్ ఆవుతోంది. సినిమా యాక్టర్స్ నిజ జీవిత పెళ్లిళ్లు ఎంత కనులవిందుగా ఉంటాయో వేరే చెప్పాలా. కానీ ఆ సంబరమంతా ఇప్పుడు లేదు. సామాజిక దూరం కనీస బాధ్యతగా మారుతున్న తరుణంలో ఇప్పట్లో ఘనమైన వేడుకలు చూడటం కలే అని చెప్పాలి. వీళ్లంతా సరే కానీ బాహుబలి వీరుడు ప్రభాస్ తన గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతాడాని ఫ్యాన్స్ వెయిటింగ్. మాములు టైంలోనే సైలెంట్ గా ఉండే డార్లింగ్ ఇప్పుడు మాత్రం మౌనం వీడుతాడా. కష్టమే.