Movies

యాంకర్ ఉదయభానును కంటతడి పెట్టించిన బాలయ్య

తెలుగు సినిమా రంగంలో మరపురాని మహానటుడు నందమూరి తారక రామారావు నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న నటసింహం బాలయ్య సొంత ఇమేజ్ బిల్డప్ చేసుకుని తెలుగు ఇండస్ట్రీలో క్రేజ్ తెచ్చుకున్నాడు. బాలయ్య ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పటికీ అలానే ఉందంటే క్రేజ్ ఎలాంటిదో చెప్పక్కర్లేదు ..జూన్ 10న ఆయన బర్త్డే కావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా నందమూరి- కొణిదల గొడవ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఇండస్ట్రీ పెద్దలు ఎంత దాచాలని ప్రయత్నించినా,, గొడవ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది.

తాజాగా బాలయ్య 60వ పుట్టినరోజు కావడంతో నందమూరి ఫాన్స్ ఆయన గురించి సినీ ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడిన కొన్ని వీడియోస్ షేర్ చేస్తున్నారు..యాంకర్ ఉదయభాను గతంలో బాలకృష్ణ గురించి మాట్లాడుతూ చాలా ఎమోషన్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాలకృష్ణ గురించి చెబుతూ ఆమె కంటతడి పెట్టుకుంది. కష్టం ఉందని తెలిస్తే చాలు వెంటనే స్పందిస్తారని, ఎంతపని ఉన్నా పక్కన పెట్టి వచ్చేస్తారని.. గుర్తు చేసుకుoది. ఈ ట్వీట్ ను నందమూరి ఫాన్స్ రీ ట్వీట్ చేస్తున్నారు.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ” నా నుంచి ఎన్నో ఆనందాలను దూరం చేసిన ఆ దేవుడు.. నాకంటూ ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు. వాళ్లే నా ప్రపంచం’’. వాళ్ల బర్త్ డే సందర్భంగా ఇండస్ట్రీలోని చాలామందికి ఫోన్ చేశాను. వాళ్ళెవరు కనీసం స్పందించలేదు. బాలయ్య బాబు కి ఒక చిన్న మెసేజ్ చేశాను. అంతే అరగంటలో ఫోన్ చేశారు. ఆయన తన పనులన్నీ మానుకుని , నా కూతుళ్ళ బర్త్డే ఫంక్షన్ కి వచ్చారు. రావటమే కాదు అందరు సెలబ్రిటీస్ లా వచ్చి వెళ్లిపోలేదు.. 45 నిమిషాలు ఉన్నారు. ఇండస్ట్రీలో అలాంటి వ్యక్తులు అరుదుగా కనిపిస్తారు. జై బాలయ్య’ అంటూ ఉదయభాను ఏడ్చేసింది. ఇప్పటికే బాలకృష్ణకు ఆమె పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేసింది.