MoviesTollywood news in telugu

TV Serial Heroines Remuneration:టాప్ టీవీ సీరియల్స్ హీరోయిన్స్ జీతం,సంపాదన ఎంతో తెలుసా?

TV Serial Heroines Remuneration:టీవీ సీరియల్స్ లో నటించే హీరోయిన్స్ ఎంత పారితోషికం తీసుకుంటారో తెలిస్తే షాక్ అవ్వలసిందే. వీరు రోజుకి ఇంత అని పారితోషికం తీసుకుంటారు. ఇప్పుడు ఆ వివరాలను తెలుసుకుందాం.

1. సుహాసిని – చంటిగాడు సినిమాతో ఎంట్రీ ఇచ్చి సినిమాలు సెట్ అవ్వక సీరియల్స్ తో బిజీగా మారింది. ఈమె 25000 తీసుకుంటుంది.

2. ప్రేమి విశ్వనాధ్ – కార్తీకదీపం సీరియల్ లో దీప అసలు పేరు ప్రేమి విశ్వనాథ్ . ఆమె కేరళలోని ఎర్నాకుళం. ఈమె ఒక ఎపిసోడ్ కి లక్ష రూపాయిలు తీసుకుంటుంది.

3. పల్లవి రామస్వామి – ఆడదే ఆధారం, భార్యామణి, మాటేమంత్రం, అత్తారింటికి దారేది పసుపు కుంకుమ వంటి సీరియల్స్ తో మంచి పేరు తెచ్చుకున్న పల్లవి రోజుకి 15000 తీసుకుంటుంది.

4. మంజుల – చంద్రముఖి, కృష్ణవేణి సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటి మంజుల రోజుకి 8000 తీసుకుంటుంది.

5. సమీరా – తెలుగు, తమిళ సీరియల్ లతోపాటు యాంకర్గానూ రాణిస్తున్న సమీరా షరీఫ్ రోజుకు పది వేల రూపాయల చొప్పున తీసుకుంటుంది.

6. అనూష – నిన్నే పెళ్ళాడుతా, శశిరేఖా పరిణయం సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్న అనూష హెగ్డే రెమ్యూనరేషన్ 10 వేల రూపాయలు.

7. ఆషిక గోపాల్ – కథలో రాజకుమారి లో అవని పాత్రతో బాగా పాపులర్ అయిన నటి ashika gopal రోజుకు 12000 రూపాయిలు తీసుకుంటుంది.

8. మహేశ్వరి – మనసు మమత సీరియల్ లో మానస పాత్రను పోషించే మహేశ్వరి రోజు వారీ పారితోషికం ఎనిమిదివేల రూపాయలు.

9. శ్రీవాణి – చంద్రముఖి, కలవారి కోడలు, మనసు మమత, రాములమ్మ వంటి సీరియల్స్ లో మంచి పేరు తెచ్చుకున్న శ్రీ వాణి యాంకర్ గాను రాణిస్తోంది. ఈమె సీన్లలో నటించేందుకు రోజుకు 10000 తీసుకుంటుంది.

10. అర్చన – కార్తీక దీపం సీరియల్ లో అత్త పాత్రతో మంచి పేరు తెచ్చుకున్న అర్చన అలియాస్ సౌందర్య రోజుకు పన్నెండు వేలు తీసుకుంటుంది.