Movies

హైపర్ ఆదికి అదిరే ఆఫర్ … అనసూయకు కన్నీటితో థ్యాంక్స్

తన అందచందాలతో మెప్పిస్తున్న రేష్మి పలు ప్రోగ్రామ్స్ లో కూడా దూసుకెళ్తోంది. ఇక బుల్లితెరపై రొమాంటిక్ పెయిర్ గా సుడిగాలి సుధీర్.. రష్మీ గౌతమ్ అని చెప్పేశేవారు. సుధీర్ కు రష్మీ కి మధ్య కెమిస్ట్రీ నడుస్తోందని గాసిప్స్ ఒక దశలో నెటిజన్లను షేక్ చేశాయి. అయితే వీరిద్దరి తర్వాత ఆ రేంజ్ లో కిక్ ఇస్తున్న పెయిర్ ఎవరనగానే అనసూయ భరద్వాజ్..హైపర్ అది అనే చెప్పాలి. తన పంచ్ టైమింగ్ తో జబర్దస్త్ రేంజ్ ని పెంచేసిన కమెడియన్ ఆది కనిపిస్తే చాలు ఎటువంటి పంచ్ లు వస్తాయో అని అందరూ ఎదురు చూస్తారు.

ఆది స్కిట్ మొదలైందంటే అనసూయ మీద వేసే పంచ్ కోసం వీక్షకులు వేయికళ్లతో ఎదురు చూస్తారు. ఆ పంచ్ కి సిగ్గుపడుతూ అనసూయ రియాక్షన్ కూడా సూపర్ హిట్టే అనిపించేలా ఉంటుంది. అయితే తాజాగా హైపర్ ఆదికి అనసూయ బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లు వైరల్ అయింది. ఇద్దరూ కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లు వార్తలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం సినిమాల కన్నా కూడా వెబ్ సిరీస్ లకు మంచి డిమాండ్ ఏర్పడింది.

ఈ నేపథ్యంలో అనసూయ, హైపర్ ఆదితో కలిసి ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రొడ్యూస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అనసూయ భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు టాక్. . అయితే హైపర్ ఆదికి ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఎలాంటి ఆఫర్లు రావడం లేదు. అందుకే హైపర్ ఆదికి కూడా తనతో సమానంగా రెమ్యూనరేషన్ ఇవ్వాలని అనసూయ చెప్పేసిందట. దీంతో ఆమె చేసిన పనికి ఆది థ్యాంక్స్ చెప్పాడట.