కరోనా మాస్క్ తో ఉన్న టాలీవుడ్ హీరోని గుర్తు పట్టారా…అయితే వెంటనే చూసేయండి
ప్రపంచాన్ని కరోనా మహామ్మారి కమ్మేస్తోంది. ధనిక దేశాలతో పాటు అన్ని దేశాలు వణికిపోతున్నాయి. రోజురోజుకీ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ పెద్దా, చిన్నా, బీదా, గొప్ప, ఆడా, మగ అనే తేడా తెలియకుండా అందరినీ కమ్మేస్తోంది. ఈ వైరస్ సోకిన తర్వాత సరైన చికిత్స తీసుకోకపోతే మరణాన్ని ఆహ్వానించినట్టే. ఇప్పటికే లక్షల మంది ఈ మహమ్మారి బారినపడి ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఇప్పటికే కొన్ని లక్షల ప్రపంచ వ్యాప్తంగా ఈ కరోనా కారణంగా కన్నుమూసారు. కొందరు సినిమా సెలబ్రిటీలకు కూడా ఈ వైరస్ సోకింది.
ఇక కరోనా కారణంగా ప్రపంచంలోని చాలా దేశాల ఆర్ధిక వ్యవస్థలు చిన్నాభిన్నామయ్యాయి. కరోనా మహమ్మారి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కూడా కలకలం రేగుతోంది. ఇప్పటికే కొద్ది మంది నటులకు ఈ వైరస్ సోకడంతో షూటింగ్స్ వాయిదా వేసేస్తున్నారు. కాగా హీరో రామ్ పోతినేని ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్’ సినిమా చేసాడు. ఎపుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా లాక్‌డౌన్ కారణంగా విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.
తాజాగా హీరో రామ్ కరోనా బారిన పడకుండా ప్రత్యేకంగా ఓ టీ షర్ట్ ధరించాడు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎన్నో ప్రత్యేకతలు ఇందులో దాగి ఉన్నాయి. తలను కూడా పూర్తిగా కప్పి ఉంటే ఈ టీ షర్ట్ వేసుకున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అంతేకాదు కరోనా బారిన పడకుండా అందరు ఇలాంటి జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చాడు. మొత్తం మీద రామ్ వేసుకున్న ఈ కరోనా మాస్క్ చూస్తుంటే ఏదో సినిమాలో వేషంగా కూడా ఉందండోయ్.