Movies

సినీ సెలబ్రిటీల కు ఇదో పెద్ద సెంటిమెంట్…ఏమిటో చూసేయండి

సెంటిమెంట్ కి పడిపోని వారుండరు. ఎందుకంటే ఎవరో ఒకరికి ఏదోక సెంటిమెంట్ ఉండడం రివాజు. ఇక సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు. ముహూర్తపు షాట్ నుంచి రిలీజ్ వరకూ అన్నీ సెంటిమెంట్ మీదే నడుస్తాయి. పోనీ ఇలా టాలీవుడ్ లోనే అనుకుంటే పొరపాటే. ప్రతి ఇండస్ట్రీలోనూ ఇలాంటివి నమ్ముతారు. ఆ హీరోకి రెండు అక్షరాల టైటిల్ అయితే ఆ సినిమా హిట్ అని.. ఈ హీరోకి ఆ నెంబర్ లక్కీ అని.. ఆ హీరోయిన్ ని తీసుకుంటే సినిమా ప్లాప్ అని ఆ డైరెక్టర్ తో సినిమా తీస్తే నెక్స్ట్ హిట్ రావడానికి చాలా కాలం వెయిట్ చేయాలని, వాళ్ళు ఆడియో ఫంక్షన్స్ కి వస్తే అంతేసంగతులని ఇలా ఎన్నో సెంటిమెంట్స్ ఉంటాయి.

అంతేకాదు, కొందరు స్టార్ హీరోలు సినిమా ఓపెనింగ్ కి వస్తే మూవీ పోయినట్టేనని సినిమా కంప్లీట్ అయ్యే దాకా గడ్డం పెంచుకుంటే సినిమా హిట్ గ్యారంటీ అని, తలకి గుడ్డ కట్టుకుంటే విజయం ఖాయమని కూడా రకరకాల సెంటిమెంట్స్ అనుసరిస్తారు. అయితే ఇలాంటి నమ్మకాలను బ్రేక్ చేసి చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగని నిజమేమో అనే డౌట్ వచ్చేలా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక కొంతమంది స్టార్ హీరోలు కొన్ని నెంబర్లని లక్కీ గా భావిస్తూ ఉంటారు. వాటినే తమ కారు రిజిస్ట్రేషన్ నెంబర్ గా/ బైక్ నెంబర్ గా/ మొబైల్ నెంబర్ గా వచ్చేలా చూసుకుంటారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కార్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎప్పుడూ కూడా ‘9999’ ఉండేలా చూసుకుంటూ ఉంటాడు. ఇందుకు ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడడు. ఇలా సినీ ఇండస్ట్రీలో చాలా మందికి ఒక్కో నంబర్ సెంటిమెంట్ గా ఉంటుంది. ఇక బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కి కూడా నెంబర్ సెంటిమెంట్ బలంగానే ఉంది. షారుఖ్ కారు లేదా /బైక్ ఏది చూసినా దాని రిజిస్ట్రేషన్ నెంబర్ ఖచ్చితంగా ‘555’ అనే ఉంటుంది. ఆ నంబర్ ఉన్న వెహికల్స్ షారుఖ్ ఖానే స్వయంగా నడుపుతారట. ఒకవేళ రే నెంబర్ ఉన్న కార్ అయితే మాత్రం తన డ్రైవర్ నడపాల్సిందేనట. ఎవరి సెంటిమెంట్ వాళ్ళది కదా.