రాజమౌళిపై షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్నా… ఆలా ఎందుకు ఆందో ?
అతితక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగి బాహుబలి సినిమాలో కూడా నటించి ఇంటర్ నేషనల్ గా ఫేమస్ అయిన మిల్కి బ్యూటీ తమన్నా తాజాగా గోపీచంద్ హీరోగా ‘సీటీమార్’ సినిమా చేస్తోంది. అంతేకాదు హిందీలో ఒకటి రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అయితే ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాను తెరకెక్కిస్తున్న దర్శకధీరుడు రాజమౌళి పై తమన్నా ఒకింత కీలక వ్యాఖ్యలు చేసింది.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమా మొదటి పార్టులో మొత్తం స్టోరీ తమన్నాపైనే నడిచింది. రెండో పార్ట్ విషయానికొస్తే.. అందులో తమన్నా పాత్ర కూరలో కరివేపాకు అనే టైపులో సాగింది. రెండో పార్ట్ మొత్తం అనుష్క పైనే ఫోకస్ పెట్టాడు. తాజాగా తమన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాజమౌళి పై షాకింగ్ కామెంట్స్ చేసింది.
బాహుబలి వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో తనకు హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చిన రాజమౌళికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాదు రాజమౌళి గురించి మాట్లాడుతూ.. ఆయనతో ఒకసారి పనిచేశారు అంటే మిగతా నటీనటులకు మరో ఛాన్స్ ఇవ్వరు. తాను తెరకెక్కిస్తోన్న కథకు ఎవరు సూట్ అవుతారో వారినే సెలెక్ట్ చేయడం రాజమౌళికి మొదటి నుంచి ఓ అలవాటు గా ఉంది’అని చెప్పుకొచ్చింది. ఒకవేళ రాజమౌళి దగ్గర నుంచి ఏ నటీనటులకైనా ఫోన్ వచ్చిందంటే .. ఆ పాత్ర ఖచ్చితంగా వారికి రాసిపెట్టినట్టే అని తమన్నా పేర్కొంది.