MoviesTollywood news in telugu

నాగార్జునకి మొదటిసారి స్క్రీన్ టెస్ట్ చేసిందెవరో తెలుసా ?

Tollywood Hero nagarjuna First Movie:నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటవారసునిగా విక్రమ్ మూవీతో వెండితెరపై హీరోగా అడుగుపెట్టి,ఆరుపదుల వయస్సులోనూ మన్మధునిగా రాణిస్తున్న అక్కినేని నాగార్జున ప్రస్తుతం కుర్ర హీరోలకు ధీటుగా నటిస్తూ తన సత్తా చాటుతూనే ఉన్నాడు. హీరోగా కొత్త వాళ్ళను ప్రోత్సహించడం లో తనకు తానె సాటిగా నిలిచాడు. కొత్త డైరెక్టర్లు,కొత్త టెక్నీషియన్స్ ని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసాడు. అంతేకాదు ఎంతోమంది కొత్తవాళ్లతో కూడా సినిమాలు నిర్మించి,తన ఉదారత చాటుకున్నాడు.

హిట్టయినా అవ్వకపోయినా సరే, ఎందరో కొత్త డైరెక్టర్స్ కి ఛాన్సిచ్చి ఎంకరేజ్ చేసిన నాగార్జున తన కొడుకులు నాగచైతన్య,అఖిల్ లను కూడా హీరోలుగా ఎంట్రీ ఇప్పించాడు. ఇంతకీ నాగార్జున వెండితెరపై మెరవడానికి తొలిసారి స్క్రీన్ టెస్ట్ ఎవరు చేశారనే సందేహం, ఈ విషయం తెలుసుకోవాలన్న ఆత్రుత చాలామందిలో ఉంది. ఆ వివరాల్లోకి ఒకసారి వెళ్తే ,ఆశ్చర్యకరమైన విషయం వెలుగు చూసింది. కెమెరా పనితనంతో తన సత్తా చాటిన ఛాయాగ్రాహకుడు గోపాల్ రెడ్డి మొట్టమొదటిసారి నాగ్ కి స్క్రీన్ టెస్ట్ చేసాడట.

ఈ విషయాన్ని నాగార్జున ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. స్క్రీన్ టెస్ట్ గోపాల్ రెడ్డి చేసినా, తొలిచిత్రం విక్రమ్ కి ఛాయాగ్రాహకునిగా పీఎస్ సుందరం పనిచేసాడు. రఫ్ గా కనిపించే నాగ్ ని అన్ని యాంగిల్స్ లో టెస్ట్ చేసి,వెండితెరకు పనికొస్తాడని తేల్చిన గోపాల్ రెడ్డి ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ నాగ్ తో కల్సి పనిచేసాడు. నిర్మాతగా కూడా మారిన గోపాల్ రెడ్డి తనకెంతో ఇష్టమైన స్నేహితుడని నాగ్ చెప్పాడు.