ఎమ్ ధర్మరాజు M.A సినిమా గురించి తెలియని కొన్ని నమ్మలేని నిజాలు
డైలాగ్ డెలివరీలో తనకు తానె సాటి అనిపించుకున్న కలెక్షన్ కింగ్ గా కూడా ముద్రపడిన మంచు మోహన్ బాబు మొదట్లో క్యారెక్టర్ యాక్టర్ గా చేస్తూనే విలన్ గా రాణించాడు. కామెడీతో కూడిన విలనిజం పండించడంలో కూడా తన సత్తా చాటిన మోహన్ బాబు విలనిజాన్ని కొత్త అర్ధం తెచ్చాడు. అయితే హీరోగా మారి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో చేసి,ఔరా అనిపించాడు.
పెదరాయుడు,అల్లుడుగారు, శ్రీ రాములయ్య వంటి మూవీస్ మోహన్ బాబులో నట విశ్వరూపాన్ని చూపించాయి. అయితే హీరోగా చేస్తున్నప్పుడే పీక్ స్టేజ్ లో ఉండగా మోహన్ బాబు చేసిన సినిమాలో హీరోగా వేసినా, విలనిజం డామినేట్ చేసింది. ఆ సినిమాయే యమధర్మరాజు ఎం ఏ. ఈ సినిమాలో మోహన్ బాబు నటనకు జనాలు ప్రశంసలు కురిపించారు.
రాజకీయ నాయకుని నిజ స్వరూపాన్ని ఆవిష్కరించిన మోహన్ బాబు ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోయి నటించాడు. అయితే విలనిజం కనిపిస్తున్నా ఎక్కడా మోహన్ బాబు క్యారెక్టర్ డీవియేట్ కాలేదు. భలే చేసాడు అని అందరూ అన్నారంటే ఈ సినిమా ఏ రేంజ్ లో ఆకట్టుకుందో వేరే చెప్పక్కర్లేదు. నిజానికి ఈ సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ అయింది. మణివణ్ణన్ డైరెక్ట్ చేసిన ‘అమైది పది’ తమిళ సినిమాకు ఎన్నో మార్పులు చేసి తీసిన ఈ సినిమాయే యమధర్మరాజు ఎం ఏ మూవీ. రాజకీయనేతగా, పోలీసాఫీసర్ గా రెండు పాత్రలు పోషించినా సరే, నెగెటివ్ షేడ్ బాగా గుర్తుండిపోయింది. పినిశెట్టి రవిరాజా డైరెక్ట్ చేసిన ఈ మూవీకి రాజ్ కోటి చక్కని సంగీతం అందించారు.