వాళ్ళు అనుకున్నా వీళ్ళతో స్టార్ట్ చేసిన మూవీస్ ..ఎన్ని ఉన్నాయో చూడండి
ఓ హీరో కోసం అనుకున్న సినిమా మరో హీరో చేతికి వెళ్లడం అప్పుడప్పుడు జరుగుతుంది. డేట్స్ ఖాళీ లేకపోవడంతో,మరో కథ ఉంటె చేద్దాం అనో .. ఇలా రకరకాల కారణాల వలన ఈమధ్య చాలా సినిమాలు ఒకరినుంచి మరొకరికి వెళ్లాయి. ఇందులో కొన్ని షూటింగ్ స్టార్ట్ చేయగా, మరికొన్ని షూటింగ్ కి రెడీ గా ఉన్నాయి. లాక్ డౌన్ వలన ఆలస్యం అయింది. సుకుమార్ డైరెక్షన్ లో బన్నీ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప మూవీ ముందుగా మహేష్ బాబు దగ్గరకు వచ్చింది. స్క్రిప్ట్ మార్పు చేయాలనీ కోరడం, ఆమేరకు ఫుల్ ఫిల్ చేయకపోవడంతో మహేష్ వదిలేసుకున్నాడు. అలాగే పింక్ రీమేక్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీస్తున్న వకీల్ సాబ్ మూవీ తొలుత బాలయ్య దగ్గరకు వెళ్ళింది.
బాలయ్య కూడా ఒకే చెప్పడం,వకీల్ సాబ్ టైటిల్ రిజిస్టర్డ్ చేయడం జరిగినా, ఏమైందో ఏమోగానీ బాలయ్య తప్పుకోవడంతో పవన్ నటిస్తున్నాడు. షూటింగ్ చాలావరకూ కంప్లిట్ కూడా అయింది. అలాగే ఫైటర్ మూవీ పూరి డైరెక్షన్ లో విజయదేవరకొండ హీరోగా వస్తున్న సంగతి తెల్సిందే. కానీ ఇస్మార్ట్ శంకర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో పూరి తీయాల్సిన ఈ సినిమాను ఆర్ ఆర్ ఆర్ మరో రెండు మూవీస్ కమిట్ మెంట్ వలన వదులుకోవాల్సి వచ్చింది. పవన్,క్రిష్ కాంబోలో పిఎస్వీకె 27చారిత్రాత్మక మూవీ గ్రాండ్ గా రాబోతోంది. అయితే ఇది ప్రభాస్ తో అనుకున్నా,డేట్స్ కుదరక ఇలా చేంజ్ అయింది.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీని బన్నీతో చేయాలనీ అనుకుంటే ఒప్పుకోలేదు. అందుకే అఖిల్ తో చేస్తున్నారు. అలాగే శివ శర్వాణ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా ఫామిలీ డ్రామా తో ఓ సినిమా వస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఆర్ ఆర్ ఆర్ వంటి సినిమాల వలన అదే మూవీ నాని హీరోగా టక్ జగదీశ్ గా తెరకెక్కబోతోంది. మహేష్,ప్రభాస్ ఇద్దరూ వద్దనుకున్న ఓ మూవీ రామ్ హీరోగా సురేంద్రరెడ్డి చేస్తున్నాడు. ఇక నాగ అశ్విన్,ప్రభాస్ కాంబోలో పాన్ ఇండియా మూవీగా తెరక్కబోయే మూవీ ముందుగా మెగాస్టార్ చిరంజీవి దగ్గరకి వెళ్ళింది. కేవలం తెలుగులోనే చేద్దామనుకున్న ఈ మూవీ ఆతర్వాత ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీగా కన్ఫర్మ్ అయింది. అశ్వినీదత్ , చిరు మధ్య చిన్న విబేధం కారణంగా ఇలా మారిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.