వానాకాలంలో వేడివేడిగా శనగల వడలు
కావలసిన పదార్ధాలు
నానబెట్టిన శనగలు – కప్పు
ఉల్లితరుగు – కప్పు
అల్లం ముక్కలు – 2 స్పూన్స్
పచ్చిమిర్చి – 5
ఉప్పు – తగినంత
జీలకర్ర – 1 టీ స్పూను
కరివేపాకు
నూనె – సరిపడ
తయారి విధానం
ముందురోజు రాత్రి శనగలను నానబెట్టాలి. తర్వాత రోజు ఉదయం నీరంతా వంపేసి శనగలు, పచ్చిమిర్చి, ఉప్పుజీలకర్ర వేసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో ఉల్లితరుగు, అల్లం ముక్కలు,కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టౌ మీద పాన్ ఉంచి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి కాగాక మిశ్రమాన్ని చిన్నచిన్న వడలుగా ఒత్తుకుని నూనెలో వేసి గోల్డ్ కలర్ వచ్చేవరకు వేగించాలి. అంతే ఎంతో రుచిగా ఉండే శనగల వడలు రెడీ . ఈ వానాకాలంలో వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి.