Movies

సూపర్ స్టార్ ఫిట్నెస్ వెనుక జిమ్ సీక్రెట్ …ఏమిటో చూడండి

నటశేఖర్ కృష్ణ వారసునిగా ఎంట్రీ ఇచ్చి, ప్రిన్స్ స్టార్ నుంచి సూపర్ స్టార్ గా ఎదిగి తండ్రిని మించిన తనయుడిగా రాణిస్తున్న మహేష్ బాబు అందం, బాడీ ఫిట్ నెస్ ల గురించి తరచూ చర్చ నడుస్తూ ఉంటుంది. మహేష్ కి నాలుగు పదుల వయస్సు దాటినా ఇంకా ఇరవై ఏళ్ల కుర్రాడిలా హ్యాండ్సమ్ గా కనిపిస్తాడు. అందుకే ఏజ్ అనేది మహేష్ కి వర్తించదని సినీ అభిమానులు అనేమాట. అందుకే మహేష్ కి దేశవ్యాప్తంగా అంతలా ఫాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా మహేష్ అందానికి.. ఫిట్ నెస్ కు ఫిదా అయిపోయి లేడీ ఫ్యాన్స్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

లాక్ డౌన్ వేళ మహేష్ పోస్ట్ చేస్తున్న ఫోటోలలో మహేష్ లుక్ చూస్తే టీనేజర్ లా ఉన్నాడంటూ కామెంట్స్ వస్తున్నాయి. సూపర్ స్టార్ లుక్స్ కి టాలీవుడ్ లోనే కాదు ఇండియా మొత్తంలో కూడా ఎవరూ సాటిరారని అంటారు. రోజురోజుకు తన గ్లామర్ ను పెంచుకుంటూ , సినిమాల్లో కూడా సత్తా చాటుతున్న మహేష్ సీక్రెట్ ఏంటో తెలియాలంటే అతను చేసే జిమ్ వర్కౌట్స్ కారణమని తేలింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన ఇంటికే పరిమితమైన మహేష్ బాబు భార్యా పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు.

ఇక అదే సమయంలో బయటకి వెళ్లేది కూడా లేకపోవడంతో పుస్తకాలు చదువుతూ.. సినిమాలు వెబ్ సిరీస్ లు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ డైలీ ఏదొక పోస్ట్ పెడుతూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు మహేష్. ఈ క్రమంలో కరోనా అవేర్నెస్ వీడియోలు పోస్ట్ చేస్తూ.. మరోవైపు ఫ్యామిలీ ఫోటోలను పంచుకుంటున్నారు. మహేష్ భార్య నమ్రత కూడా మహేష్ కి సంబంధించిన విషయాలను కూడా ఎప్పటికప్పుడు వెల్లడిస్తోంది. తాజాగా మహేష్ పర్సనల్ జిమ్ కి సమందించి ఓ వీడియో వైరల్ అవుతోంది. తన భర్త ఫిట్నెస్ సీక్రెట్ ఇదే అంటూ మహేష్ ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్న విశాలమైన జిమ్ వీడియో సోషల్ మీడియాలో పంచుకుంది.