చిరు,బాలయ్య బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని సార్లు వార్ జరిగిందో…ఎవరు గెలిచారో…?
సినిమా హీరోల అభిమానులు తమ హీరో గొప్పంటే తమ హీరో గొప్పని వాదించుకోవడం,ఒక్కోసారి ఘర్షణకు దారితీయడం చూస్తుంటాం గానీ, హీరోలంతా మంచి ఫ్రెండ్స్ గానే ఉంటారు. ఒకరితో ఒకరు అనుబంధం కలిగివుంటారు. అయితే సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రం అభిమానుల మధ్య పోటీ హీరోల మధ్యగా మారిపోతోంది. ఇక టాలీవుడ్ లో అగ్ర హీరోలుగా వెలుగొందుతూ ఒకప్పుడు మూవీల మధ్య స్టార్ వార్ నడిచిన హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి,నందమూరి నటసింహం బాలయ్య లను ప్రధానంగా చెప్పుకోవాలి. ప్రధానంగా పండగ,వేసవి సీజన్స్ లో అలాగే మిగిలిన రోజుల్లో కూడా పోటాపోటీగా వీరి సినిమాలు విడుదలై సవాల్ గా నిలిచేవి. బాలయ్య నటించిన మంగమ్మగారి మనవడు ,చిరంజీవి ఇంటిగుట్టు సినిమాలు 1984లో మూడు రోజుల వ్యవధిలో బరిలో నిలిచాయి. ఈ రెండింటిలో సుహాసిని హీరోయిన్. అయితే మంగమ్మగారి మనవడు సూపర్ డూపర్ హిట్ కొట్టింది.
అదే ఏడాది చిరు రుస్తుం,బాలయ్య కథానాయకుడు మూవీస్ తో తలపడ్డారు. డిసెంబర్ లో వారం రోజుల వ్యవధిలో వచ్చిన ఈ మూవీస్ లో రుస్తుం హిట్ కొట్టింది. కథలో బలం ఉన్నా కథానాయకుడు కొంచెం వెనుకబడింది. 1985లో చిరు చట్టంతో పోరాటం,బాలయ్య ఆత్మబలం మూవీస్ పోటీ పడ్డాయి. ఇక 1986లో నిప్పులాంటి మనిషిగా బాలయ్య,కొండవీటి రాజాగా చిరు వచ్చారు. అయితే వారం తేడాలో వచ్చిన ఈ సినిమాల్లో కొండవీటి దొంగ దూసుకెళ్లింది. అలాగే అపూర్వ సహోదరులు మూవీతో బాలయ్య, రాక్షసుడు మూవీతో చిరు వచ్చారు. ఇక్కడ కూడా రాక్షసుడు విజయం అందుకోగా ,వారం గ్యాప్ తో వచ్చిన అపూర్వ సహోదరులు ఆకట్టుకోలేదు. అలాగే భార్గవరాముడుగా బాలయ్య, దొంగమొగుడుగా చిరు వచ్చారు. 1987లో జనవరిలో మూడు రోజుల తేడాతో వచ్చిన ఈ సినిమాల్లో దొంగమొగుడు సూపర్ హిట్ అయింది.
ఇక అదే ఏడాది రాముగా బాలయ్య,పసివాడి ప్రాణంతో చిరంజీవి వచ్చారు. రెండూ హిట్ కొట్టినా, పసివాడి ప్రాణం బ్లాక్ బస్టర్ అయింది. 1988 జనవరి లో బాలయ్య ఇనస్పెక్టర్ ప్రతాప్,చిరు మంచిదొంగ వచ్చాయి. మంచిదొంగ హిట్ కొట్టింది. మరుసటి ఏడాది వచ్చిన చిరు యుద్ధభూమి అంచనాలు అందుకోలేదు. అయితే బాలయ్య రాముడు భీముడు వారం వ్యవధిలో వచ్చి హిట్ కొట్టింది. ఇక 1997జనవరిలో హిట్లర్ గా వచ్చిన చిరంజీవి హిట్ కొట్టాడు. పెద్దన్నయ్య గా వచ్చిన బాలయ్య కూడా హిట్ అందుకున్నాడు.
2000 సంక్రాంతికి అన్నయ్య సినిమాతో చిరు బ్లాక్ బస్టర్ అందుకోగా, వంశోద్దారకుడు మూవీతో వచ్చి బోల్తా కొట్టాడు. 2001జనవరిలో బాలయ్య నరసింహనాయుడుగా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకోగా, చిరు మృగరాజుగా వచ్చి,ప్లాప్ అయ్యాడు. అదే ఏడాది జూన్ లో బాలయ్య భలేవాడివి బాసూ మూవీతో వస్తే,చిరు శ్రీ మంజునాథతో వచ్చాడు. చిరుకి ఎక్కువ మార్కులు పడ్డాయి. 2004లో లక్ష్మీ నరసింహాతో బాలయ్య వచ్చి కలెక్షన్స్ వర్షం కురిపించగా, చిరంజీవి భారీ మూవీ అంజి నష్టాలు తెచ్చింది. ఇక చిరు రాజకీయాల నుంచి సినిమాలకు రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ఖైదీ నెంబర్ 150తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. అయితే గౌతమీ పుత్ర శాతకర్ణితో వచ్చిన బాలయ్య కూడా హిట్ అందుకున్నాడు.