ఎన్ని అనుకుంటున్నా మారని నయన్…ఇలా ఎందుకు ఉంటుందో తెలుసా ?
తమిళంలోనే కాకుండా మిగిలిన భాషల్లో కూడా పట్టు సాధించి, సౌత్ స్టార్ హీరోయిన్ గా ఎదగడమే కాదు, హయ్యస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా వెలుగుతున్న నయనతార కొన్ని రూల్స్ పెట్టుకుని ఆ పరిధిలో నడుస్తోంది. కెరీర్ ఆరంభంలో ఒకటి రెండు ఐటెం సాంగ్స్ చేసినా నయన్ స్టార్ డం వచ్చిన తర్వాత ఐటెం సాంగ్స్ జోలికి వెళ్లలేదు. ఆఫర్స్ వచ్చినా, డబ్బు ఆశ చూపించినా సరే, అసలు అటువైపు చూడడంలేదు. అందుకే నయన్ కి కాస్త తల పొగరు ఎక్కువ అంటూ కొందరు నిర్మాతల టాక్. పైగా తాను నటించిన సినిమాల ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా నయన్ పాల్గొనదు.
ఇక పారితోషికం విషయంలో కొందరు స్టార్ హీరోలను, నిర్మాతలను కూడా ఇబ్బంది పెట్టిన సందర్బాలు ఉన్నాయంటూ గతంలో ప్రచారం జోరుగానే సాగింది. అయితే ఎవరెన్ని అనుకున్నా సరే, తన పాత్ర విషయంలో చాలా క్లారిటీగా క్లీయర్ గా ఉంటూ లేడీ సూపర్ స్టార్ గా పేరు దక్కించుకున్న నయన్ ఐటెం సాంగ్స్ విషయంలో ఎక్కడా రాజీ పడదు. స్టార్స్ అయినా సూపర్ స్టార్స్ అయినా డోంట్ కేర్ అనేట్టుగానే నయన్ వ్యవహారం ఉంటుంది.
సౌత్ లో హీరోల స్థాయిలో పారితోషికం డిమాండ్ చేసే ఏకైక హీరోయిన్ నయన్ ఇప్పటికి కూడా తన పద్దతి ఏమాత్రం మార్చుకోలేదు. అందుకే స్టార్ హీరోలకు పోటీగా నిలుస్తోంది. ఇప్పుడే కాదు, అంతకు ముందు కూడా ఐటెం సాంగ్స్ ఆఫర్ కాదనుకుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రంలో ఐటెం సాంగ్ చేయించేందుకు ప్రయత్నాలు చేశారట. అయితే నయన్ ఎంతటి స్టార్ అయినా ఐటెం సాంగ్ చేసే ప్రసక్తే లేదని తేల్చేసింది. ఇప్పటికీ ఆమెది అదే బాట అదే ఒరవడి .. దటీజ్ నయన్ అని ఫాన్స్ కామెంట్స్ చేస్తుంటారు.