బిగ్ బీకి ఇప్పటికి ఏ వ్యాధులు ఉన్నాయి…వాటి తీవ్రత ఎంత…డాక్టర్స్ ఏమంటున్నారు
కరోనా మహమ్మారి గత ఆరునెలలుగా ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వాళ్ళూ వీళ్లూ,… అదీ ఇదీ… , గొప్ప బీద …. అనే తరతమ బేధం లేకుండా అందరినీ ఈ మహమ్మారి కాటేస్తోంది. ఇప్పటీకే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు కరొనతో వణికిపోతున్నాయి. అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ఆర్ధికంగా అతలాకుతలం చేసేస్తోంది. వాక్సిన్ వచ్చేవరకూ జాగ్రత్తలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పల్లెలకు కూడా విస్తరిస్తోన్న కరోనా సినిమా ప్రముఖులను కూడా వదలడంలేదు.
కంటికి కనిపించని శత్రువుతో అందరూ యుద్ధం చేస్తున్నారు. అయినా కట్టడి కావడంలేదు. తాజాగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో పాటు ఆయన కుటుంబాన్ని తాకింది. దీంతో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కరోనా సోకినట్లు స్వయంగా బిగ్ బి ట్వీట్ చేయడంతో శనివారం అర్ధరాత్రి హుటాహుటీన ముంబై నానావతి హాస్పిటల్ కి తరలించారు. కొన్నాళ్లుగా లక్షణాలు ఉండడంతో టెస్ట్ లో బయటపడిందని బిగ్ బి చెప్పుకొచ్చారు. ఇక ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ కి కూడా పాజిటివ్ వచ్చింది.
గత కొన్ని రోజులుగా తమను కల్సినవాళ్లు కూడా టెస్టులు చేయించుకోవాలని అమితాబ్, అభిషేక్ వెల్లడించారు. 1942అక్టోబర్ 11న జన్మించిన బిగ్ బి ప్రస్తుతం 77వ సంవత్సరంలో ఉన్నారు. ఈయన ఆరోగ్యంపై పలు కథనాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే కాలేయ,ఉదర సంబంధ వ్యాధులపై ఎన్నోసార్లు చికిత్స తీసుకున్న బిగ్ బి కి ప్రాణాంతక కరోనా రావడం ఆందోళనకరమే. 1982లో కూలి షూటింగ్ లో ప్రమాదం జరగడంతో అప్పటినుంచి కాలేయ సంబంధ వ్యాధితో చికిత్స పొందుతున్నారు. నాలుగు దశాబ్దాలుగా వైద్యుల సూచనల మేరకు నడుచుకుంటున్న బిగ్ బి ఈమధ్య కాలంలో పలుసార్లు చికిత్స పొందారు. అందుకే ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తతతో ఉంటున్నారు. ఐసోలేషన్ లో ఉంచి చికిత్స చేస్తున్నామని,వెంటిలేటర్ పెట్టలేదని వైద్యులు ప్రకటించారు. బిగ్ బి కోలుకోవాలని దేశంలోని ఫాన్స్ తో పాటు అన్ని భాషల నటీనటులు కోరుకుంటున్నారు.