Movies

ఉదయ్ కిరణ్ కెరీర్ లో సినిమాల బడ్జెట్,కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒక లుక్ వేయండి

టాలీవుడ్ లో ఎన్నో విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ,స్టార్ రేంజ్ కి ఎదిగే వాళ్ళుంటారు. ఫుల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నాసరే, వెనుకబడిపోయేవాళ్లూ ఉన్నారు. కొందరు చరిత్ర సృష్టిస్తే, మరికొందరు చరిత్రలో కల్సిపోతారు. ఇలా ఎన్నో చిత్రవిచిత్రాలుంటాయి. 2000లో చిత్రం మూవీతో తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్ తారాజువ్వలా వెలుగొంది, అంతేవేగంగా ఈలోకం నుంచి నిష్క్రమించాడు. లవర్ బాయ్ గా అందమైన చిరునవ్వు,అద్భుత నటనతో 2014వరకూ కెరీర్ సాగింది. ఇంకా ఎంతో భవిష్యత్తుగల ఉదయ్ మరణం ఫాన్స్ నే కాదు,ఇండస్ట్రీలో చాలామందిని కలచివేసింది. అనుకోని కారణాలతో జీవితంలో వచ్చిన ఒడిదుడుకులను తట్టుకుని నిలబడలేక ఆత్మహత్య చేసుకున్న ఉదయ్ బతికి ఉంటె ఎన్నో అద్భుత మూవీస్ చేసి ఉండేవాడని అందరూ అనేమాట.

తేజ డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తూ తీసిన చిత్రం మూవీ ఉదయ్ కి కూడా తొలిమూవీయే. 26లక్షలతో తీసిన ఈ సినిమా 35లక్షలు వసూలు చేసి బ్లాక్ బస్టర్ అయింది. ఇక రెండవ సినిమా కూడా తేజ డైరెక్షన్ లోనే నువ్వు నేను రూపంలో వచ్చింది. 2001లో 45లక్షలతో తీసిన ఈ సినిమా 65లక్షలు వసూలు చేసింది. అదే ఏడాది వి ఎన్ ఆదిత్య డైరెక్షన్ లో వచ్చిన మనసంతా నువ్వే మూవీతో హ్యాట్రిక్ హీరో అయిపోయాడు. 65లలక్షలతో తీస్తే కోటిన్నర పైనే వసూలు చేసింది. రఘురాజ్ డైరెక్షన్ లో వచ్చిన కలుసుకోవాలని మూవీ యావరేజ్. 55లక్షలతో తీస్తే 65లక్షలు రాబట్టింది. 2002లో వచ్చిన శ్రీరామ్ ప్లాప్. 56లక్షలతో తీస్తే 60లక్షలు వచ్చింది. 45లక్షలతో పరుచూరి మురళీ డైరెక్షన్ లో వచ్చిన నీ స్నేహం మూవీ 65లక్షలు కలెక్ట్ చేసింది.

35లక్షలతో తీసిన హోలీ 40లక్షలు కలెక్ట్ చేసి ప్లాప్ అయింది. ఆతర్వాత జోడి నెంబర్ వన్ సెనిమా భారీ ప్లాప్. 35లక్షలతో తీస్తే, 22లక్షలు వచ్చాయి. నీకు నేను నాకు నువ్వు మూవీ యావేరేజ్. 45లక్షలకు 65లక్షలు వసూలుచేసింది. ఆతర్వాత లవ్ టుడే మూవీ ప్లాప్. 35లక్షలకు 30లక్షలు మాత్రమే వచాయి. 2005లో తేజ డైరెక్షన్ లో వచ్చిన ఔనన్నా కాదన్నా మూవీ ఏవరేజ్. 30లక్షల బడ్జెట్ అయితే 45లక్షలు తెచ్చింది. ఇక కె బాలచందర్ డైరెక్షన్ లో వచ్చిన అబద్దం మూవీ వర్కవుట్ కాలేదు.

25లక్షలతో తీస్తే ,30లక్షలు వసూలుచేసింది. 45లక్షల ఖర్చుతో వియ్యాల వారి కయ్యలు మూవీ తీస్తే,35లక్షలు వసూలు చేసింది. 2008లో 30లక్షలతో వంబు సండే పేరిట తీసిన మూవీ ప్లాప్. 25లక్షలు వసూలు చేసింది. ఆతరువాత మదన్ డైరెక్షన్ లో వచ్చిన గుండె ఝల్లుమంది మూవీ కూడా ప్లాప్. 45లక్షలతో తీస్తే, 40లక్షలు మాత్రమే వచ్చింది. అదే ఏడాది ఏకలవ్య పేరిట తీసిన మూవీ కూడా ప్లాప్. 2012లో నువ్వక్కడుంటే నేనిక్కడుంటా మూవీ ,2013లో జై శ్రీరామ్ ఇలా వరుస సినిమాలు ప్లాప్. 2014లో చిత్రం చెప్పిన కథ మూవీ రిలీజ్ కాకుండానే ఇతడి కథ ముగిసిపోయింది.