Movies

పవన్ చేసిన తప్పే చిరు రిపీట్ చేస్తున్నాడా…?

రాజకీయాలనుంచి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక వరుస సినిమాలు చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో చేస్తున్నాడు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరిగినా, కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది. మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా పొలిటికల్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మలయాళ ‘లూసిఫర్’ సూపర్ హిట్ అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ సినిమా రీమేక్ రైట్స్ రామ్ చరణ్ హోమ్ బ్యానర్ కొణిదల ప్రొడక్షన్స్ పోటీపడి మరీ కొనేసింది. ‘ఆచార్య’ కంప్లీట్ తర్వాత ఈ సినిమా స్టార్ట్ చేసే ఆలోచన చేస్తున్నారు.

‘సాహో’ ఫేమ్ సుజీత్ దర్శకత్వం చేయడానికి ఒకే చెప్పడమే కాకుండా మన నేటివిటీకి తగ్గట్లు స్క్రిప్ట్ లో కూడా మార్పులు చేర్పులు చేసే పనిలో ఉన్నాడని టాక్. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్ చేస్తున్నాడనే వార్తలతో మెగా అభిమానులు కలవరపడుతున్నారు. ఎందుకంటే, ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్ ‘లూసిఫర్’ పేరుతో ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఇంటికే పరిమితమైన జనాలు ఇప్పటికే ఈ సినిమా వీక్షించేసారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ అదే ‘లూసిఫర్’ సినిమా చిరంజీవి తెలుగులో రీమేక్ చేయడం ప్రమాదమని ఫాన్స్ భావిస్తున్నారు.

స్టోరీలో ఎన్ని మార్పులు చేర్పులు చేసినా ఆల్రెడీ ఆ సినిమా ప్రేక్షకులు చూసిందే గా అంటున్నారు. గతంలో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ – తమన్నా జంటగా నటించిన తమిళ్ మూవీ ‘వీరమ్’ సినిమాని ‘వీరుడొక్కడే’ పేరుతో తెలుగులో డబ్ చేసి విడుదల చేసారు. అయితే పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ పేరుతో తెలుగులో రీమేక్ చేసి, పవన్ కూడా ఇలానే ఆల్రెడీ థియేటర్స్ లో రిలీజైన సినిమా రీమేక్ చేసి ఎంతగా దెబ్బతిన్నాడో ఫాన్స్ కి తెలుసు కదా. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఆల్రెడీ జనాలు చూసేసిన ‘లూసిఫర్’ ని రీమేక్ చేసి పవన్ కళ్యాణ్ చేసిన తప్పే చిరు కూడా చేయబోతున్నారని మెగా అభిమానులు కలవరం చెందుతున్నారు.