సుహాసిని కోసం మెగాస్టార్ ఎవరు చేయని పెద్ద సాహసం చేసాడట…నిజామా…ఎందుకో చూడండి
Chiranjeevi and suhasini news:సౌత్ ఇండియా సూపర్ స్టార్ కమల్ హాసన్ అన్న కూతురు సుహాసిని తెలుగు,తమిళ చిత్రాల్లో హీరోయిన్ గా నటించి ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. చారు హాసన్ కూతురైన సుహాసిని ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం ని పెళ్లాడింది. ప్రస్తుతం అక్కా ,వదిన,తల్లి పాత్రలతో సెకండ్ ఇన్నింగ్స్ కూడా విజయవంతంగా సాగిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవితో కల్సి ఆరాధన,చంటబ్బాయి వంటి ఎన్నో చిత్రాల్లో నటించిన సుహాసిని తెలుగు,తమిళ అగ్ర హీరోలందరి సరసన చేసింది. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్యూలో చిరంజీవి తనకోసం చేసిన సాహసాన్ని ప్రస్తావించడంతో బాగా వైరల్ అవుతోంది.
“గతంలో నాతో పాటు కొందరు నటులు కూడా షూటింగ్ పూర్తిచేసుకుని వస్తున్నామని, రాత్రి సమయం కావడంతో కొందరు ఆకతాయిలు మద్యం సేవించి బాటిళ్లు,రాళ్లు విసురుతుంటే అటుగా కారులో వెళ్తున్న చిరంజీవి దిగి,గన్ తీసి బెదిరించడంతో ఆకతాయిలు పారిపోయారు”అని సుహాసిని వివరించింది. రియల్ హీరో చిరంజీవి అంటూ సరదాగా చెప్పింది.