Guess The Actor:ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా…ఇప్పుడు ఎక్కడ ఎలా ఉందో తెలుసా ?
Tollywood heroine nikitha thukral:దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేసిన హాయ్ మూవీ ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఏవండోయ్ శ్రీవారు,నీ నవ్వే చాలు,డాన్, కల్యాణరాముడు వంటి మూవీస్ తో హీరోయిన్ నికిత ఆడియన్స్ కి కనెక్ట్ అయింది. ఈ పంజాబీ భామ తెలుగులో ఎంట్రీ ఇస్తూనే మంచి మార్కులు తెచ్చుకుంది.
ఈ అమ్మడు తెలుగులో ఆతర్వాత పలుచిత్రాలు చేసినా పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే తెలుగు,తమిళ, కన్నడ భాషల్లో హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నికిత ఆమధ్య కన్నడ దర్శకునితో ప్రేమాయణం నడిపి కన్నడ చిత్ర పరిశ్రమ బహిష్కరణకు కూడా గురైందన్న వార్తలు అప్పట్లో గుప్పుమన్నాయి.
ఇక ఈ ముద్దుగుమ్మ వీటిని పుకార్లుగా కొట్టిపారేస్తూ ఖండన కూడా ఇచ్చింది. ఈ అమ్మడి చేతిలో సినిమాలు లేకపోవడంతో ముంబై కి చెందిన వ్యాపారవేత్తతో ప్రేమలో పడి, ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లాడింది. ప్రస్తుతం ఒక పాప కూడా వీరికి ఉంది.