MoviesTollywood news in telugu

Race Gurram Movie:రేసుగుర్రం సినిమా వెనక ఉన్న కొన్ని నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు

Race Gurram Movie:మొట్టమొదటిసారి వందకోట్ల గ్రాస్ కొట్టిన రేసు గుర్రం మూవీ అల్లు అర్జున్ కెరీర్ ని కూడా మలుపు తిప్పింది. అతిధి మూవీ చేస్తున్న సమయంలోనే బన్నీతో డైరెక్టర్ సురేంద్రరెడ్డి మూవీ ప్లాన్ చేసాడు. అది వాయిదా పడుతూ చివరకు ఊసరవెల్లి షూటింగ్ సమయంలో తన తర్వాత సినిమాను బన్నీతో కంఫర్మ్ చేసుకున్నాడు.

ఊసరవెల్లీ పూర్తవడంతో బన్నీతో మూవీకోసం వక్కంతం వంశీకి కథ బాధ్యతలు అప్పగించారు. అయితే అప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో బన్నీ కమిట్ అవ్వడంతో సురేంద్రరెడ్డిని పక్కన పెట్టాడు. అలా చేసిన జులాయి చేసి ,సూపర్ హిట్ అందుకున్నాడు.

అప్పుడు సురేంద్రరెడ్డికి కబురు వెళ్ళింది. జులాయి తర్వాత కెరీర్ ని దృష్టిలో పెట్టుకుని కొత్తగా కథ ప్లాన్ చేయాల్సి వచ్చింది. ఆవారాగా ఉంటూ ఫ్యామిలీ పట్ల బాధ్యతగా ఉండే గ్యాంగ్ లీడర్ లాంటి కథ వక్కంతం వంశీ ప్లాన్ చేసారు. మెగాస్టార్ కి నచ్చేసింది. దీంతో 2012అక్టోబర్ లో మూవీ ప్రకటన వచ్చింది. సమంత కు ఖాళీ లేకపోవడంతో శృతిహాసన్ ని సెలక్ట్ చేసారు.

అన్నయ్య పాత్రకు కిక్ శ్యాం. ఇక జగపతి బాబుని అడిగినా,లెజెండ్ వచ్చాకే విలన్ పాత్రలు వేస్తానని చెప్పేసాడు. దాంతో భోజ్ పురిలో కొత్త హీరో రవికిషన్ ని తీసుకున్నారు.తారాగణం ఎంపికకు ఆరునెలలు పట్టేసింది. 2013మే13న రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో, చార్మినార్, అల్యూమినియం ఫ్యాక్టరీ , గోల్కొండ,శంకరపల్లి హైవే తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేసారు. స్విజర్లాండ్ లాంటి చోట్ల సాంగ్స్ షూట్ చేసారు.

ఇక ఈసినిమాలో ఫైట్ డూప్ తో కాకుండా ఒరిజనల్ గా చేయడంతో అప్పటికే భుజానికి సర్జరీ చేయించుకున్న బన్నీ మరోసారి సర్జరీ చేయించు కున్నాడు. 2014సంక్రాంతికి రిలీజ్ కి ప్లాన్ చేస్తే,… మహేష్ వన్, రామచరణ్ ఎవడు మూవీస్ ఉండడంతో వేసవికి వాయిదా వేశారు. 140రోజుల పాటు తీశారు. ఇక ఆడియో సూపర్ హిట్. ఇక అంచనాలను మరింత పెంచేసింది.

2014ఏప్రియల్ 11న భారీగా రిలీజయింది. బన్నీ యాక్టింగ్ ఎనర్జీ హైలెట్ అయింది. పోసాని,శ్రీనివాసరెడ్డి తదితరుల కామెడీ సీన్స్ , మద్దాల శివారెడ్డిగా రవికిషన్ తదితరుల యాక్షన్ అదిరింది. డైరెక్టర్ సురేంద్రరెడ్డి టేకింగ్ స్టైల్ కి తమన్ సాంగ్స్ తోడైంది. ఇక బన్నీ యాక్షన్ సీన్స్ అదిరాయి.

అందుకే బన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. తొలివారం 33కోట్ల షేర్ తో ఆల్ టైమ్ టాప్ ఫోర్ గా నిల్చింది. నైజాం లో 17కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఇక తూర్పు గోదావరి కాకినాడలో 82లక్షల షేర్ తో మరో సంచలనం క్రియేట్ చేసింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ 58కోట్లు టోటల్ కలెక్షన్ చేసి,టాప్ 5మూవీగా నిల్చింది.26సెంటర్స్ లో 100రోజులు ఆడింది. పవన్,రామ్ చరణ్,మహేష్ బాబు తరవాత వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా బన్నీకి గుర్తింపు పొందింది.