రకుల్ కెరీర్ లో చేసిన సినిమాల్లో ఎన్ని హిట్స్…ఎన్ని ప్లాప్స్ ఉన్నాయో చూడండి
బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ టాలీవుడ్ లో టాప్ మోస్ట్ హీరోయిన్ గా ఛాన్స్ లు దక్కించుకుంది. గిలి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ 2011లో కెరటం మూవీలో గెస్ట్ రోల్ చేసి,2013లో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 2014లో ది ఆర్య బాలీవుడ్ మూవీ సెమీ హిట్ గా నిల్చింది. ఆతర్వాత తమిళంలో తెలుగులో ఎన్నో సినిమాలు చేసింది. 22సినిమాలు చేస్తే మూడు ప్లాప్ అయ్యాయి. యావరేజ్ ,ఎబో ఏవరేజ్ ఒక్కొక్కటి,రెండు హిట్స్,నాలుగు సూపర్ హిట్స్, గా నిలిచాయి. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా పాగా వేసి హిట్స్ అందుకుంది. ఇక వ్యాపార రంగంలో కూడా రాణిస్తోంది. ఒక జిమ్ కూడా సక్సెస్ ఫుల్ గా నడిపిస్తోంది.
తెలుగులో ఆమె చేసిన లవ్ ఫ్రెండ్స్ మూవీ టాప్ హిట్ గా నిల్చింది. గోపీచంద్ సహనటుడిగా చేసిన ఈ మూవీ 2014లో టాప్ హిట్ గా అయింది. అదే ఏడాది మంచు మనోజ్ కరెంట్ తీగ మూవీలో మళ్ళీ హీరోయిన్ గా చేసింది. యావరేజ్ గా నిల్చింది. 2015లో రామ్ సరసన పండగ చేస్కో మూవీ చేయగా ఎబో ఏవరేజ్ అయింది. అదే ఏడాది కిక్ 2ప్లాప్ అయింది. ఇక 2015లో బ్రుస్ లీ ద ఫైటర్ అనే మూవీలో యాక్ట్ చేసింది. రామ్ చరణ్ సరసన చేసిన ఈమూవీ కథ ,కథనం సరిగ్గా లేకపోవడంతో ప్లాప్ అయింది.
ఇక 2016లో నాన్నకు ప్రేమతో మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించి హిట్ కొట్టింది. అల్లు అర్జున్ తో సరైనోడు,అలాగే రామ్ చరణ్ తో ధ్రువ లో జోడీ కట్టి బ్లాక్ బస్టర్స్ అందుకుని హ్యాట్రిక్ హీరోయిన్ గా 2016లో నిల్చింది. ఆతర్వాత జూనియర్ హీరోల వైపు మళ్ళిన ఈ భామ రారండోయ్ వేడుక చూద్దాం అంటూ నాగ చైతన్య సరసన చేసి,యావరేజ్ టాక్ తెచ్చుకుంది. జై జానకి నాయిక పేరుతొ బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నటించి హిట్ తెచ్చుకుంది.2017లో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన స్పైడర్ లో నటించింది. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు.