Movies

మెగా ఫ్యామిలీ మెంబర్‌ పిక్ వైరల్…ఎవరో గుర్తు పట్టారా ?

సెలబ్రిటీలు అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటున్నారు. అసలే లాక్ డౌన్ కూడా అమల్లో ఉండడం వలన ఇంటికి పరిమితమైన సెలబ్రిటీలు తమ తీపి గుర్తులను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటే, ఫాన్స్ షేర్ చేస్తున్నారు. తాజాగా మెగా ఫ్యామిలీ మెంబర్‌ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటో ఎవరిదో కాదు, మెగాస్టార్ చిరంజీవి కోడలు.. రామ్ చరణ్ భార్య ఉపాసన ఫోటో.

నిజానికి ఎప్పటినుంచో ఆమె సోషల్ మీడియాలో ఉంది. మెగాస్టార్ చిరంజీవి, చరణ్ సోషల్ మీడియలో యాక్టివ్‌గా లేనపుడు వాళ్లకు సంబంధించిన విషయాలను ఎప్పటి కపుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండేది. అంతేకాదు ఇపుడు అపోలో హెల్త్ కేర్ బాధ్యతలు నిర్వహిస్తూ తనదైన శైలిలో సెలబ్రిటీల డైట్స్ గురించి ఇంటర్వ్యూలు కూడా చేస్తోంది. తనకు హెల్త్ విషయంలో తెలిసిన చిట్కాలను సోషల్ మీడియా ద్వారా మాములు ప్రజలకు అవగాహన కల్పిస్తోంది.

అంతేకాదు తాను నిర్వహిస్తోన్న పత్రికల కోసం సెలబ్రిటీల ఇంటర్వ్యూలు కూడా చేస్తూ వార్తల్లో నిలవడం ఉపాసన స్ఫెషాలిటీ. రీసెంట్‌గా ఉపాసన రైతు అవతారం ఎత్తి తన ఫామ్‌హౌస్‌లో సేంద్రియా వ్యవసాయం చేస్తూ వార్తల్లో నిలిచింది. ఇక ఇటీవల ఉపాసన, రామ్ చరణ్ తన 8వ వార్షికోత్సవంతో పాటు తన పుట్టినరోజును ఎంతో సింపుల్‌గా జరుపుకుంది. మెగా వారి కోడలు అయ్యాక ఈమెకు సోషల్ మీడియాలో వీరలెవెల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. షేర్ మీద షేర్ చేస్తూ ఉండడంతో వైరల్ అవుతోంది.