Beauty Tips

టూత్ పేస్ట్ ఇలా వాడితే మొటిమలు,నల్లటి వలయాలు మాయం….దీనిలో నిజం ఎంత ?

Tooth Paste Beauty Tips : టూత్ పేస్ట్ పళ్ళను మిలమిల మెరిసేలా చేయటమే కాకుండా ఎన్నో చర్మ ప్రయోజనాలను అందిస్తుంది. మనలో చాలా మందికి ఈ విషయం తెలియదు. ఇప్పుడు ఆ విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. అయితే రంగు రంగుల పేస్ట్ కన్నా తెల్లని పేస్ట్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.తెల్లటి టూత్ పేస్ట్ లో ఫ్లోరైడ్ తక్కువగా ఉంటుంది. అందువల్ల చర్మానికి ఎటువంటి హాని కలగదు.
Tooth Paste
మొటిమ‌లు, మ‌చ్చ‌లు, ముడ‌త‌లు, క‌ళ్ల కింద నల్లని వలయాలు ఇలా అనేక చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను నివారించ‌డంలో టూత్ పేస్ట్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఒక బౌల్ లో పేస్ట్ వేసి దానిలో కొంచెం తేనే కలిపి మొటిమలు ఉన్న ప్రదేశంలో రాసి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
Face Beauty Tips In telugu
ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తే మొటిమలు,మొటిమల మచ్చలు అన్ని మాయం అయ్యిపోతాయి. టూత్ పేస్ట్‌లో కొద్దిగా నిమ్మ‌ర‌సం కలిపి ముఖానికి రాసి అరగంట అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముడ‌త‌లు త‌గ్గ‌డంతో పాటు చర్మాన్ని బిగుతుగా అయ్యేలా చేస్తుంది.టూత్ పేస్ట్ లో ఎన్నో బ్యూటీ ప్రయోజనాలు ఉన్నాయి.

ఈ చిట్కాలను పాటించే ముందు పేస్ట్‌పై ఉన్న ఇంగ్రిడియన్స్‌ని చూడాలి. తక్కువ ఫ్లోరైడ్ శాతం ఉన్న టూట్ పేస్ట్‌ని మాత్రమే వాడాలి. మీకు గతంలో ఏమైనా ఎలర్జీలు ఉన్నట్లయితే టూత్ పేస్ట్‌ను కొంచెం చేతికి రాసుకుని 5 నిమిషాలు అలా వదిలేయండి. మంట, దురద, ఎలర్జీలు ఏమైనా వస్తే ఈ చిట్కాలను పాటించవద్దు.
https://www.chaipakodi.com/