జబర్దస్త్ – అదిరింది..రేటింగ్స్ లో ఎంత తేడా ఉందో చూడండి
జబర్దస్త్ కామెడీ షో క్లిక్ అవ్వడంతో నాగబాబు ,రోజా పాత్ర అమోఘమని చెప్పాలి కానీ నాగబాబు వెళ్లిపోయిన తర్వాత కూడా జబర్దస్త్ టిఆర్పీ రేటింగ్స్‌లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. నిజానికి ఒకప్పుడు ఆరెంజ్ సినిమా తర్వాత నాగబాబు కెరీర్ పూర్తిగా డైలమాలో పడిపోయి, ఓ సమయంలో అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకుందామనుకున్నాడు. అప్పుడే జబర్దస్త్ అతడికి ఊపిరి పోసింది. అందుకే ఎంత కాదనుకున్నా నాగబాబుకు, జబర్దస్త్ కామెడీ షోకు విడదీయరాని అనుబంధం ఉంది. ఎందుకో జబర్దస్త్ షో చేసే మల్లెమాల సంస్థ నాగబాబుకు నచ్చలేదు ఆయన మారిపోయాడు. కానీ నాగబాబు వెళ్లినంత మాత్రానా రేటింగ్స్ పడిపోతాయా అంటే మాత్రం లేదనే సమాధానమే కనిపిస్తోంది. ఒకవేళ నాగబాబు వెళ్లిన తర్వాత జబర్దస్త్ కామెడీ షో కొన్ని వారాలు ఇబ్బంది పడిన మాట వాస్తవమే అయినా కూడా చాలా త్వరగా పుంజుకుంది.
ఇప్పుడు కూడా రేటింగ్స్ అద్భుతంగా వస్తున్నాయి. అయితే మంచి రెమ్యునరేషన్ వచ్చినపుడు నాగబాబు మారడంలో తప్పేం లేదనే వాళ్లు కూడా ఉన్నారు. కానీ లైఫ్ ఇచ్చిన షోను వదిలి వెళ్లే ముందు ఓసారి ఆలోచించుకుని ఉంటే బాగుండేదని నాగబాబుకు సలహాలు కూడా ఇచ్చారు. కానీ ఆయన మాత్రం కాదనుకుని వెళ్లిపోయాడు. ఇక నాగబాబు అదిరింది అంటూ జీ తెలుగులో మరో షో మొదలుపెట్టాడు. అయితే జబర్దస్త్ కామెడీ షోకు పోటీగా వచ్చినా కూడా ఇప్పటి వరకు అది ప్రభావం చూపించింది మాత్రం తక్కువే. మరోవైపు నాగబాబు లేకపోయినా కూడా జబర్దస్త్ మాత్రం దుమ్ము దులిపేస్తూనే ఉంది. రేటింగ్స్‌లో టాప్‌లోనే ఉంది. దానికితోడు అదిరింది షోకు రేటింగ్స్ ఊహించినంతగా రావడం లేదనే ప్రచారం. నిజానికి రేటింగ్స్ వస్తున్నా కూడా ఊహించినంత మాత్రం రావడం లేదు.
ఈ పరిస్థితుల్లో జీ సంస్థ కూడా తర్జనభర్జన పడుతుంది. టీమ్స్ బాగానే ఉన్నా కూడా ఎక్కడో రేటింగ్స్ విషయంలో మాత్రం తేడా కొట్టడంతో జబర్దస్త్ వైపు నాగబాబు ఆలోచించినా కూడా మల్లెమాల మాత్రం నో ఎంట్రీ బోర్డ్ పెట్టినట్లు టాక్ నడిచింది. ఎందుకంటే, వెళ్లేప్పుడు మామూలుగా వెళ్లిపోయుంటే అసలు సమస్యే ఉండేది కాదు అయితే కమెడియన్లు ఏమైపోయినా కూడా కేవలం లాభాలు మాత్రమే చూసుకున్నా రంటూ మల్లెమాల నిర్మాణ సంస్థపై మెగా బ్రదర్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. దాంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలే రీ ఎంట్రీకి అడ్డుగా మారుతున్నాయని టాక్. లాక్‌డౌన్ తర్వాత మొదలైన ఎపిసోడ్స్‌లో అదిరింది, జబర్దస్త్ అదిరిపోయే కంటెంట్ అందిస్తున్నాయి. ఈ రెండూ కూడా కామెడీ పరంగా దూసుకుపోతున్నాయి. కానీ రేటింగ్స్ మాత్రం జబర్దస్త్‌కు ఎక్కువగా వస్తున్నాయి. అయితే గతంతో పోలిస్తే అదిరింది కూడా పుంజుకుందని టాక్.