Healthhealth tips in telugu

వెన్ను నొప్పిని వేగంగా తగ్గించే ఆహారాలు … మీరు తింటున్నారా ?

Back Pain Home Remedies : ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వేదించే సమస్యల్లో వెన్ను నొప్పి ముఖ్యమైనది. వెన్ను నొప్పి వచ్చిందంటే ఆ నొప్పి చాలా బాధాకరంగా ఉంటుంది. అలాగే నిల్చోలేరు కూర్చోలేరు. కొంచెం దూరం కూడా నడవలేరు. ఈ నొప్పి రావటానికి వ్యాయామం చేయకపోవటం,అధిక బరువు,సరైన జీవనశైలి లేకపోవటం వంటివి కారణాలుగా చెప్పవచ్చు.
pasupu benefits
వెన్ను నొప్పి ప్రారంభ దశలో ఉంటే కనుక కొన్ని ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే కొంత ఉపశమనం కలుగుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. పసుపును తీసుకుంటూ ఉండాలి. పసుపులో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు, కుర్కుమిన్ వాపును తగ్గించటమే కాకుండా నాడీ వ్యవస్థ ను ఆరోగ్యంగా ఉంచటానికి సహాయపడుతుంది.

కాబట్టి ప్రతి రోజు పాలల్లో చిటికెడు పసుపు వేసుకొని తాగితే ఉపశమనం కలుగుతుంది. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్దిగా ఉండుట వలన ఆహారంలో అల్లంను తీసుకుంటే వెంటనే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. కాబట్టి టీలో చిన్న అల్లం ముక్క వేసుకుంటే సరిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.