Movies

ఈ సినిమాలు ఎందుకు ఆడలేదు….ఒక లుక్ వేయండి

కొన్ని సినిమాలు బాగున్నా సరే, అండర్ రేటింగ్ కి గురవుతాయి. పబ్లిసిటీ,ప్రమోషన్ వర్క్ ఇలా చాలా మైనస్ పాయింట్స్ వలన కొన్ని సినిమాలు దెబ్బతింటున్నాయి. డైరెక్టర్ యేలేటి చంద్రశేఖర్ తీసిన ఐతే మూవీ. కొత్త టైప్ మూవీని పరిచయం చేసారు. మొదటి సినిమాకే నంది అవార్డు, నేషనల్ అవార్డు కొట్టాడు. తర్వాత అనుకోకుండా ఒకరోజు మూవీ బెస్ట్ ఎడ్వాంచర్ మూవీ.

ఒకడున్నాడు మూవీలో గోపీచంద్ యాక్టింగ్ అదుర్స్. థియేటర్ లో ఎంతమంది చూసారో గానీ టివిలో వచ్చినపుడు మంచి రేటింగ్ వచ్చింది. ప్రయాణం మూవీ లో ఎయిర్ పోర్టులోనే మొత్తం లవ్ స్టోరీ చూపించాడు యేలేటి. ఇక సాహసం,మనమంతా మూవీస్ కూడా అనుకున్నంత రేంజ్ రాలేదు. ఎన్నో విజయవంతమైన ,సాహోసోపేతమైన సీన్స్ తీసిన డైరెక్టర్ యేలేటి. స్టార్ డైరెక్టర్స్ అనగానే ఎవరెవరి పేర్లు చెప్పొచ్చు గానీ, యేలేటి కూడా ఫేమస్ డైరెక్టర్ అని చెప్పాలి

పూరి జగన్నాధ్ తీసిన రవితేజ నటించిన నేనింతే మూవీ, బాగోలేదని టాక్ వచ్చినా కంటెంట్ మాత్రం ఎనర్జీ ఇస్తుందని కొందరు చెప్పేమాట. అసలు వీరిద్దరి కాంబినేషన్ సూపర్భ్ . కానీ ఈ సినిమాకు రావాల్సిన రెస్పాన్స్ రాలేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఓ డైరెక్టర్ అవ్వాలంటే ఎంతటి కష్టమో రవితేజ కేరక్టర్ ద్వారా పూరి చెప్పుకొచ్చాడు. టాలెంట్ లక్ లేకుంటే, ఎప్పటికి అనుకున్న రేంజ్ కి చేరుకోలేమని ఎం ఎస్ నారాయణ కేరక్టర్ ద్వారా .. మా హీరో కోసం ఏదైనా చెస్తామని సాయిరాం క్యారెక్టర్ ద్వారా, .. ఓ సినిమా థియేటర్ కి వెళ్లాలంటే ఎంతకష్టమో షియాజీ షిండే క్యారెక్టర్ ద్వారా .. తమ పిల్లలు అన్ కండీషన్ ల గా వాళ్లకి ఎన్ని కష్టాలొచ్చినా సపోర్ట్ చేసే పేరెంట్స్ ఉంటారని రమాప్రభ క్యారెక్టర్ ద్వారా.. ఇక మీడియాలో వచ్చే గాసిప్స్ వలన స్టార్స్ లైఫ్ ఎంతగా డిస్టర్బ్ అవుతుందో ముమైత్ ఖాన్ క్యారెక్టర్ ద్వారా పూరి ఈ మూవీలో చెప్పాడు.

ఈ జనరేషన్ లో క్లాస్ సిన్మాలు శేఖర్ కమ్ముల తీసినట్టు ఎవరూ తీయలేరు. సుమంత్ ,కమిలిని ముఖర్జీ హీరో హీరోయిన్స్ గా నీతూ చంద్ తదితరుల తారాగణంతో తెరకెక్కించిన గోదావరి మూవీలో మ్యూజిక్ , విజువల్స్,కథనం ఇలా అన్నీ సూపర్. ఇక పాపికొండలు ఒక్కసారైనా చూడాలి అని ఈ మూవీ చూస్తే తప్పకుండా అనిపిస్తుంది. రాధాకృష్ణన్ మంచి మ్యూజిక్ ఇచ్చిన ఈ మూవీ లో ఎస్పీ బాలు పాడిన టైటిల్ సాంగ్ సూపర్. వేటూరి అద్భుతంగా రాసారు. కోటిలాంటి కేరక్టర్ పెట్టి,ఆయనే డబ్బింగ్ చెప్పాలన్న ఊహకు నిజంగా శేఖర్ కమ్ములను అభినందించాలి. హ్యాపీ డేస్, ఫిదా,లీడర్ లాంటి మూవీస్ ప్రస్తావిస్తూ శేఖర్ కమ్ముల గురించి గొప్పగా చెబుతాం కానీ,గోదావరి మూవీ అంతకంటే గొప్పదని కొందరి వాదన.

ఇక అనసూయ మూవీ కూడా బెస్ట్ మూవీయేనని ,వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమని కొందరి విశ్లేషణ. గులాబీ పువ్వు గోవింద్ మోస్ట్ సైకో. సినిమా టేకింగ్ గానీ, భూమికరావు బాబు యాక్టింగ్ అన్నీ అద్భుతమే. గులాబీ పువ్వు గోవింద్ క్యారెక్టర్ లో రవిబాబు చేసిన యాక్టింగ్ మాములుగా చెప్పలేం. భైరవుడు వంటి సైకోల గురించి చెబుతాం గానీ, గులాబీ పువ్వు గోవింద్ క్యారెక్టర్ అప్పట్లోనే ఓ సెన్షేషన్. సరిగ్గా అదే సమయంలో మంత్ర మూవీ రావడంతో అనసూయ మూవీకి రావాల్సినంత క్రేజ్ రాలేదు.