Movies

అలనాటి హీరోయిన్ గుర్తు ఉందా….ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా ?

చిరంజీవి హీరోగా వచ్చిన “ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య” అనే సినిమాలో చిట్టి తల్లి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన పూర్ణిమ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పూర్ణిమ తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ భాషలలో కూడా నటించి ప్రేక్షకులను బాగానే అలరించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. పూర్ణిమ ఒక ఇంటర్వ్యూలో క్రమశిక్షణ మరియు సమయ నిబంధనలు క్రమం తప్పకుండా పాటించటం వలన దర్శక నిర్మాతలు తనను ఎంతగానో అభిమానించేవారని చెప్పింది.

ప్రేమ గురించి మాట్లాడుతూ సినిమాల్లో బిజీగా ఉండుట వలన ప్రేమించటానికి సమయం దొరకలేదని, అలాగే ప్రేమ మీద పెద్దగా నమ్మకం లేదని చెప్పింది. పెళ్లి అయ్యాక సినిమాలకు విరామం ఇచ్చింది. ప్రస్తుతం తన భర్త, పిల్లలతో సంతోషంగా గడుపుతున్నానని చెప్పుకొచ్చింది. పూర్ణిమ తెలుగు తమిళ, కన్నడ, మలయాళ తదితర భాషలలో దాదాపు 100 చిత్రాలలో పైగా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించింది.