Movies

సమరసింహా రెడ్డి సినిమా గురించి ఈ విషయాలు మీకు తెలుసా…ఎన్ని కోట్ల లాభమో ?

స్టార్ హీరోకి కంటెంట్ తోడైనప్పుడు ,అది కూడానా ఫ్యాక్షనిజం నేపథ్యంలో సినిమా అయితే ఆ సినిమా కోసం ఎంతటి అంచనాలు ఉంటాయో,ఎంతగా ఎదురుచూస్తారో చెప్పలేం. నటసింహ బాలకృష్ణ హీరోగా బి గోపాల్ డైరెక్షన్ లో లారీ డ్రైవర్ షూటింగ్ జరుగుతోంది. అప్పుడు విజయేంద్రప్రసాద్ ని గోపాల్ కలిశారు. అప్పటికే జానకీరాముడుకి కథ అందించారు. అసమయంలోనే గోపాల్ కి కొన్ని కథలు చెప్పారు. 1997లో కూడా కొన్ని కథలు చెప్పినా ఏదీ నచ్చలేదు. ఇక అప్పటికే గోపాల్ కి ఆరు ప్లాప్ లు. ఇక గుండమ్మ కథలాంటి కథ ఒకటి ఉంది. అయితే సింధూరపువ్వు సినిమాలో ఒకావిడ సవతి పిల్లలను సరిగ్గా చూడడు.

అది నచ్చని కొడుకు వేరేచోటకు వెళ్లి , హీరో దగ్గర డ్రైవర్ గా చేరతాడు. హీరో డాన్. అతడిపై ప్రత్యర్ధులు దాడిచేసినపుడు అతడిని కాపాడే ప్రయత్నంలో డ్రైవర్ మరణిస్తాడు. డ్రైవర్ గురించి తెల్సుకున్న హీరో అతడి ఊరు వెళ్లి అతడి కుటుంబాన్ని కష్టాలనుంచి బయట పడేస్తాడు. అప్పుడే విజయేంద్రప్రసాద్ బ్రెయిన్ షార్ప్ గా పనిచేసింది. అదే పనివాడు పొరపాటున హీరో చేతిలో చనిపోతే ఎలా ఉంటుంది అని ఆలోచించాడు.

ఫస్టాఫ్ గుండమ్మ కథలోని కామెడీ సీన్స్,సెకండాఫ్ సింధూరపువ్వు మూవీలోని సీన్స్ ఈ రెండింటిని తీసుకుని బలమైన ఫ్లాష్ బ్యాక్ తో కథ రాసేశారు. అదే సమరసింహారెడ్డి. బి గోపాల్ కి కథ విపరీతంగా నచ్చేసింది. ముంబయి మాఫియా నేపథ్యంలో చేద్దామని విజయేంద్ర ప్రసాద్ చెబితే, అక్కడే సంభాణల రచయిత రత్నం రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో చేద్దామని సలహా ఇచ్చారు. రైల్వే స్టేషన్ లో ఇరు వర్గాల సంఘటనను రత్నం నిజజీవితంలో జరిగిన సంఘటన జోడించారు.

విజయవాడలో వంగవీటి,దేవినేని ఫ్యామిలీస్ గొడవల నేపథ్యంలో ఇరువురు ఒకేసారి రైల్వే స్టేషన్ కి రావడంతో ఇరు వర్గాలు మోహరించాయి. ఇది చూసిన పోలీసులు వారికి సర్దిచెప్పడానికి తలప్రాణం తోకకు వచ్చింది. ఇది రత్నం స్వయంగా చూడ్డంతో సమరసింహారెడ్డిలో ఆ సంఘటన జోడించారు. ఇక గోపాల్,నిర్మాత చెంగల వెంకట్రావు,విజయేంద్రప్రసాద్ మద్రాసు వెళ్లి బాలయ్యకు కథ చెప్పారు. మీకెలా ఉంది అని గోపాల్ ని అడగ్గానే సన్నివేశాలన్నీ బాగున్నాయి,పైగా రాయలసీమలో మీకు ఆదరణ ఉండనే ఉంది అని చెప్పడంతో చేసేద్దాం అని బాలయ్య అన్నాడు.

అలా సినిమా స్టార్ అయింది. మణిశర్మ మంచి బాణీలు ఇచ్చారు. అందాల ఆడబొమ్మ సాంగ్ అదిరిపోయింది. దీనికోసం సిరివెన్నెల సీతారామ శాస్త్రి 15పల్లవులు రాసారు. మరో రెండు రాసారు. బి గోపాల్ కి ఏదీ నచ్చలేదు. చివరిగా ఒకటి రాయండి,మొత్తం 18లో ఎదో ఒకటి సెలెక్ట్ చేసేస్తాం అని గోపాల్ అనడంతో అప్పుడు అందాల ఆడబొమ్మ పల్లవి పడింది. ఆ పాట జనంలోకి దూసుకెళ్లింది. ఈ సినిమా రాయలసీమలో బాగా ఆదరించారు. బాలయ్య నటన అదరగొట్టేసాడు. ఇక జయప్రకాశ్ రెడ్డి యాక్షన్ అదిరింది. బాలయ్య డైలాగులు ఆడియన్స్ కి పూనకం తెచ్చేసాయి. భైరవ ద్వీపం తర్వాత ఆ రేంజ్ సినిమా లేకపోవడంతో నిరాశ లో ఉన్న ఫాన్స్ ఈ సినిమాకు ఈలలు,చప్పట్లే కాదు,కాసుల వర్షం కురిపించారు.

14కోట్లు షేర్ పొందిన తొలితెలుగు మూవీగా నిల్చింది. 32కేంద్రాల్లో 175రోజులు ఆడింది. తద్వారా సల్మాన్ ఖాన్ మూవీ ఆల్ ఇండియా రికార్డ్ ని సమరసింహారెడ్డి మూవీ బద్దలు కొట్టింది . 73సెంటర్స్ లో రోజూ మూడు ఆటలతో వందరోజలు నడిచిన మొదటి సౌత్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. రాయలసీమలో 22కేంద్రాల్లో వందరోజులు,8సెంటర్స్ లో 175రోజులు పూర్తిచేసిన తొలిసినిమా. గుంటూరులో పది కేంద్రాల్లో వందరోజులు నడిచిన సినిమా గా రికార్డ్ క్రియేట్ చేసింది. రోజూ 4ఆటలతో220రోజులు 17కేంద్రాల్లో ఆడిన మూవీగా రికార్డ్. వైజాగ్,విజయవాడ, గుంటూరులలో అత్యధిక కలెక్షన్స్ చేసిన మూవీగా మరో రికార్డ్. గుడివాడలో సిల్వర్ జూబ్లీ చేసుకున్న కొన్ని సినిమాల్లో ఇదొకటి. ఇక ప్రస్తుతం టికెట్ రేట్లతో పోలిస్తే, ఈ సినిమా కలెక్షన్ 350కోట్లకు సమానమని చెబుతారు.