Movies

వడ్డే నవీన్ గుర్తు ఉన్నాడా…ఎక్కడ ఉంటున్నాడు….ఏమి చేస్తున్నాడో తెలుసా ?

బొబ్బిలి పులి వంటి హిట్ చిత్రాలను అందించిన వడ్డే రమేష్ తనయుడు నవీన్ టాలీవుడ్ లో కోరుకున్న ప్రియుడు మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. కోడి రామకృష్ణ డైరెక్షన్ చేసిన ఈ మూవీ మంచి పేరు తెచ్చింది. మానసిచ్చి చూడు, బాగున్నారా, మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది, ఇలా 30సినిమాల వరకూ నటించాడు. అయితే ఎటాక్ సినిమా తర్వాత సడన్ గా టాలీవుడ్ నుంచి కనుమరుగయ్యాడు.

రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన ఈమూవీ 2014లో వచ్చింది. ఇక 2010లో శ్రీమతి కళ్యాణం మూవీలో నటించిన నవీన్ మంచి కెరీర్ ఉన్నా సరే,2001తర్వాత ఒక్కటి కూడా హిట్ కాలేదు. సరైన కథలు ఎంచుకోకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఎంచుకున్న సినిమాలన్నీ ప్రేమ కథా చిత్రాలే కావడం ,ఒకే మూసలో ఉండడం వలన దెబ్బతిన్నాడని టాక్.

మొదట్లో యూత్ ,ఆతర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకున్న నవీన్ ఈమధ్య అతడి కొడుకు ఫంక్షన్ లో కనిపించాడు. లేటెస్ట్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మళ్ళీ సినిమాల్లో నటిస్తే బావుణ్ణు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం వ్యాపార లావాదేవీలు విజయవంతంగా నిర్వహిస్తూ,ఫ్యామిలీతో ఆనందంగా ఉంటున్నాడని టాక్.
https://www.chaipakodi.com/